Sirivennela Seetharama Sastri: టాలీవుడ్ పాటల పూదోటలో పుట్టిన ఆణిముత్యం ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త పాటలతో సొబుగులు అద్దిన పాటల మాంత్రికుడాయన. అంతటి గొప్ప పాటల రచయిత మరణం టాలీవుడ్ ను శోకసంద్రంలో ముచ్చెత్తింది. ఆత్మీయుడిని కోల్పోయిన దు:ఖంలో మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప మాల విరమణ చేసి మరీ సీతారామశాస్త్రిని కడసారి చూడడానికి వచ్చాడంటే ఆయన ఘనతను అర్థం చేసుకోవచ్చు.
సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు శాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని కిమ్స్ ఆస్పత్రి అధికారికంగా ప్రకటించింది.
-సిరివెన్నెల ఎలా చనిపోయారు?
సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఆయనకు న్యూమోనియానే అనుకున్నారు. కానీ కిమ్స్ ఆస్పత్రి అధికారిక ప్రకటన చూశాక అసలు విషయం అర్థమైంది. సిరివెన్నెలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని.. దాని తీవ్రతతోనే ఆయన చనిపోయారని అధికారికంగా తెలిసింది.
-ఎప్పటి నుంచి సిరివెన్నెలకు క్యాన్సర్.? చికిత్స ఎలా సాగింది?
సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ క్యాన్సర్ మాయరోగం ఇప్పటిది కాదు.. ఆరేళ్ల క్రితమే గుర్తించారు. ఈ క్రమంలోనే సగం ఊపిరితిత్తులను ఆయనకు ఇప్పటికే క్యాన్సర్ బారిన పడడంతో తొలగించారు. ఇటీవలే మరో ఊపిరితిత్తులకు కూడా క్యాన్సర్ వ్యాపిస్తే దాన్ని సగం తీసేశారని తెలిసింది. ఆ సర్జరీ చేసిన తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఒక ఊపిరితిత్తు లేకపోవడం.. ఉన్న దాంట్లో సగం తీసేయడంతో సిరివెన్నుల ఇన్ ఫెక్షన్ బారినపడ్డట్టు తెలిసింది. ఆ ఇన్ ఫెక్షన్ శరీరం మొత్తం సోకడంతోనే సిరివెన్నెల మరణించారని కిమ్స్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
Also Read: సిరివెన్నెలకు ఘన నివాళి అర్పించిన గూగుల్… ఎమోషనల్ ట్వీట్
-ఐదురోజులుగా అచేతన స్థితిలో..
క్యాన్సర్ తో లంగ్స్ దెబ్బతిని తీసేయడం.. ఇన్ ఫెక్షన్ బారినపడడంతో ఐదురోజులు గా ఎక్మోపైనే సిరివెన్నెలకు వైద్యం అందుతోంది. ఆయన అచేతన స్థితిలోనే ఉండిపోయారు. కృత్రిమ శ్వాసపైనే బతుకుతున్నారు. చివరకు పరిస్థితి విషమించి ఈరోజు తుదిశ్వాస విడిచారు. నిజానికి అందరూ న్యూమోనియాతో చనిపోయారని అనుకున్నా ఆరేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు చాలా మందికి తెలియదు. తాజాగా తెలిసి సిరివెన్నెల ఎంత బాధ అనుభవిస్తూ చనిపోయారో తెలుస్తోంది.
Also Read: దర్శకుడు త్రివిక్రమ్.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి వరుసకు ఏమవుతాడు?