Sirivennela Seetharama Sastry: ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సిరివెన్నెల లేని లోతు కేవలం తెలుగు పరిశ్రమకే కాక యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సిరివెన్నెల మరణంపై ట్విట్టర్ లో తన సంతాపాన్ని తెలియజేశారు.
ఈ మేరకు ఆ పోస్ట్ లో ’ అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నల గారి మృతి నన్నెంతగానో బాధించింది. ఆయన రచనల్లో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి .‘ అంటూ ట్విట్టర్ లో తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సంధర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మ శ్రీ అందుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశారు.
Also Read: త్రివిక్రమ్ను ఓదార్చిన పవన్కళ్యాణ్.. సిరివెన్నెల భౌతికగాయానికి నివాళి
అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU
— Narendra Modi (@narendramodi) November 30, 2021
విశ్వనాధ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల సినిమాతో రచయితగా తన కెరీర్ ప్రారంభించిన సిరివెన్నెల గారు దాదాపు 3000 పైగా పాటలను రచించారు. రుద్రవీణలోని “లలిత ప్రియ కమలం విరిసినదీ” పాటకు జాతీయ అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 సార్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు… 4 సార్లు ఫిలింఫేర్ అవార్డులను సిరివెన్నెల అందుకున్నారు. అలాగే 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఒక దిగ్గజాన్ని చిత్ర పరిశ్రమ కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: మన రాకలు, పోకలు మన చేతుల్లో ఉండవు – సిరివెన్నెల సీతారామశాస్త్రి