Tribal Jewellery: బంజారాలు ధరించే ఆభరణాలు ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..? మంగ్లీ వెళ్లడంతో ఆ తండా ఫేమస్..

Tribal Jewellery: కడియాలు.. బెండ బిల్లలు.. తిత్రీ.. కమ్మర్ పట్టీ.. మర్కీ.. ఈ పేర్లు కొంత మందికి కొత్తగా కనిపించవచ్చు. కానీ గిరిజనులకు మాత్రం సుపరిచితమే. ఇవి వాళ్లు సాంప్రదాయంగా ధరించే దుస్తులతో పాటు వేసుకునే ఆభరణాలు. సాధారణ చాలా మంది మహిళలు అందంగా కనిపించేందుకు బంగారు నగలను ధరిస్తారు. కానీ లంబాడీల వేర్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వర్గానికి చెందిన మహిళలు సాంప్రదాయంగా వేసుకునే అద్దాల డ్రెస్ తో పాటు జర్మనీ వెండి నగలను వేసుకుంటారు. […]

Written By: Chai Muchhata, Updated On : April 21, 2023 9:54 am
Follow us on

Tribal Jewellery

Tribal Jewellery: కడియాలు.. బెండ బిల్లలు.. తిత్రీ.. కమ్మర్ పట్టీ.. మర్కీ.. ఈ పేర్లు కొంత మందికి కొత్తగా కనిపించవచ్చు. కానీ గిరిజనులకు మాత్రం సుపరిచితమే. ఇవి వాళ్లు సాంప్రదాయంగా ధరించే దుస్తులతో పాటు వేసుకునే ఆభరణాలు. సాధారణ చాలా మంది మహిళలు అందంగా కనిపించేందుకు బంగారు నగలను ధరిస్తారు. కానీ లంబాడీల వేర్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వర్గానికి చెందిన మహిళలు సాంప్రదాయంగా వేసుకునే అద్దాల డ్రెస్ తో పాటు జర్మనీ వెండి నగలను వేసుకుంటారు. వీటీతో పాటు పైన చెప్పిన పేర్లతో కూడిన ఆభరణాలు, సిమెంట్ పట్టీల లాంటి గాజులు వేసుకుంటారు. అయితే లంబాడీలు సాంప్రదాయాలు ధరించే ఈ డ్రెస్సులు ఎక్కడ లభిస్తాయి? ఎవరు వీటిని తయారు చేస్తారు? అనేది కొంతమంది గిరిజనులకు కూడా తెలియని సమాధానం. కానీ ఇటీవల ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ నగలను తయారు చేసే చోటుకు వెళ్లారు. అంతేకాకుండా ఆమె టీవీల్లో, సినిమాల్లో వేసుకున్న డ్రెస్సును అక్కడే తయారు చేయించుకున్నారు. మరి ఆ ప్రదేశం గురించి తెలుసుకుందామా.

తెలుగు రాష్ట్రాల్లోని వారు ప్రత్యేకంగా..

దేశంలో చాలా రాష్ట్రాల్లో లంబాడి గిరిజనులు ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. అద్దాల డ్రెస్సు, జర్మనీ తీగతో తయారు చేసిన ఆభరణాలు, చేతులనిండా గాజులు కాళ్లకు వివిధ ఆభరణాలు, ముక్కెర తదితర అభరణాలు కనిపిస్తాయి. వీరు ఎక్కువగా ఇలాంటి డ్రెస్సులను కొమురవెళ్లి, నాగోబా, తదితర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కొనుగోలు చేస్తారు. కానీ వీటిని ఎక్కడ తయారు చేస్తారో చాలా మందికి తెలియదు. ఇప్పుడు వారి గురించి తెలిశాక చాలా మంది లంబాడీలు అక్కడికే వెళ్లి వారికి అనుగుణంగా నగలను తయారు చేయించుకుంటున్నారు.

ఆ తండా ఇప్పుడు ఫేమస్..

ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బీబీపూర్ గ్రామ పరిధిలో ఉన్న అవుసుల్ తండా ఇప్పుడు ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రముఖ సింగర్ మంగ్లీ ఇక్కడికి వెళ్లి తన నగలను తయారు చేసుకున్న తరువాత ఈ తండా ఫేమస్ గా మారింది. ఇక్కడి వారు రాజస్థాన్ నుంచి వలస వచ్చారు. 34 కుటుంబాలు జీవిస్తున్న ఇక్కడి ప్రతి ఇంట్లో లంబాడీలు ధరించే సాంప్రదాయ నగలను తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన వాటిని ఏడుపాయల దుర్గమ్మ, మైదారం, నాగోబా, కొమురవెల్లి లాంటి ప్రదేశాల్లో విక్రయిస్తారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల వారే కాకుండా మహారాష్ట్రలోని పర్బణి, పుణె, ఛత్తీస్ గఢ్ లోని గడ్చిరోలి నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ ఆభరణాలు కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.

Tribal Jewellery

ఆగ్రా నుంచి ముడి సరుకు..

బంజారాలు వాడే ఈ వస్త్రాలపై వేసే అద్దాలు, రకరకాల పూసలు ఇతర ప్రాంతాల నంచి తీసుకొచ్చి తయారు చేస్తారు. ఆభరణాల్లో వాడే ఆభరణాలు మాత్రం జర్మని వెండితో తయారు చేస్తారు. దీనీని వీళ్లు ఆగ్రా నుంచి ముడిసరుకు తీసుకొస్తారు. జర్మనీ సిల్వర్ కిలోకు రూ.2000 నుంచి ఉంటుంది. వీటిని ఎన్నిరోజులు వాడిని వాటి షైన్ తగ్గదు. ఇలా వీటితో కడియాలు, కహార్, టోప్లి, తిత్రీ, మర్కీ లాంటి ఆభరణాలు తయారు చేస్తారు.

20 మందికి క్యాన్సర్..

అయితే జర్మనీ వెండితో ఆభరణాలు తయారు చేయడం వల్ల వీరు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు తండాలో 20 మందికి క్యాన్సర్ సోకిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఇద్దరు మరణించారు కూడా. ఎంతో మందికి అందాన్నిచ్చే ఆభరణాలు తయారు చేస్తున్న తమలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ మీడియి ఎంటర్ ప్రైజేస్ సహకారంతో వసుంధర చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి వీరికి ఉఏపాధిని అందించేందుకు సంకల్పించింది. కానీ దీని కోసం షెడ్డు నిర్మించినా మిషనరీ మాత్రం ఇక్కడికి రాలేదని వారు చెబుతున్నారు.

సినిమా వాళ్లు క్యూ..

బంజారాల సాంప్రదాయానికి వన్నె తెచ్చెలా ఉండే సాంప్రదాయ నగలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందనే చెప్పారు. తీజ్, తదితర ప్రత్యేక కార్యక్రమాల్లో వీరు ఆ డ్రెస్సులను తప్పక ధరిస్తారు. అంతేకాకుండా సినిమాల్లోని వారు సైతం ఉపయోగించేందుకు ఇక్కడికి వచ్చి దుస్తులను, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రభుత్వం సహకరిస్తే వారు మరింత ఉన్నత స్థితికి వెళ్తారని పలువురు బంజారా సంఘాల నాయకులు కోరుతున్నారు.