
Simran : సినిమాల్లో వినోదాన్ని అందించే చాలా మంది నటుల రియల్ లైఫ్ లో ఎన్నో విషాదాలు దాగి ఉంటాయి. తెరపై వారు ప్రేక్షకులను సంతోషపెట్టడానికి నటిస్తారు. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి దు:ఖభారంలో మునిగిపోతారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు జీవితాంతం వారిని గుర్తు చేసుకుంటూ మదనపడుతారు. వారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ అలనాటి రోజులను నెమరేసుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఏదో ఒక విషాదం దాగే ఉంటుంది. అలాగే సౌత్ ఇండస్ట్రీలోని ఓస్టార్ హీరోయిన్ జీవితంలో మరిచిపోలేని ఘటన ఆమెను ఎంతో బాధపెడతోంది.
హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో అలరించిన సిమ్రన్ గురించి తెలియని వారుండరు. తెలుగులో అగ్ర హీరోలందరి పక్కన నటించిన ఆమె సినిమాలు దాదాపు సక్సెస్ గానే నిలిచాయి. ఆమెతో కలిసి నటిస్తే ఆ సినిమా సక్సెస్ అన్నంత రేంజ్ లో హీరోయిన్ దూసుకుపోయింది. కొన్నాళ్లు హవా సాగించిన సిమ్రన్ ఆ తరువాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కొన్ని తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఇటీవల మాధవన్ తో కలిసి ‘రాకెట్రీయార్’లో తల్లి పాత్రలో నటించింది.
సిమ్రన్ జీవితంలోనూ ఓ విషాధం దాగి ఉంది. తాను ఎంతో ప్రాణంగా చూసుకునే తన చెల్లెలు అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెల్లెలు మోనాల్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ‘ఇంద్ర ధనుస్సు’ తో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో ‘ఇష్టం’ సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. అయితే కెరీర్మంచి పొజిషన్లో ఉండగానే సడెన్లీగా ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలకం రేపింది.
మోనాల్ గంలో సుజిత్ అనే కొరియోగ్రాఫర్ ను ప్రేమించిందట. ఆ తరువాత అతను మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను ఎంతో ప్రాణంగా చూసుకునే చెల్లెలు కనిపించకుండా పోయినందుకు సిమ్రన్ ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. ఆమెను గుర్తు చేసుకుంటూ లేటేస్టుగా వీరిద్దరు కలిసున్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ‘నా అందమైన సోదరి మోనాల్.. నిన్ను ఎప్పటికీ మరిచిపోలేను’ అంటూ పోస్టు చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.