
Car – Summer : మే నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే అగ్గిలోకి వెళ్లినట్లే అవుతుంది. దీంతో చాలా మంది చల్లదనం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కూలర్లు, ఏసీలు పెట్టుకొని హాయిగా జీవిస్తున్నారు. అయితే బయటకు వెళ్లే వారి పరిస్థితి మరీ కాస్త కష్టంగానే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఫీల్డులోకి వెళ్లేవారు ఎండ వేడికి తట్టుకోలేక చాలా మంది అనారోగ్యాన బారిన పడుతున్నారు. కొందరు కార్లలో తిరిగిన వారికీ ఈ బాధలు తప్పడం లేదు. అయితే కార్లలో ఏసీ ఉంటుందిగా? అనే డౌట్ రావచ్చు. కానీ ఎంత ఏసీ ఉన్నా సరైన చల్లదనం దొరకదు. నాచురాలిటీ వచ్చే గాలి ఎంతో హాయినిస్తుంది. అలాంటి నాచురాలిటీ గాలితో పాటు మంచి వెంటిలేషన్ ఇచ్చే కార్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఆ కార్ల గురించి తెలుసుకుందాం..
టాటా నెక్సన్:
TaTa Nexon 1199 సీసీ నుంచి 1497 వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 113.42 బీహెచ్ పీ పవర్ తో పెట్రోల్, డీజీల్ తో లీటర్ కు 24.07 మైలేజ్ ఇస్తుంది. 5 గురు సౌకర్యంగా కూర్చునే ఇందులో వెంటిలేటేడ్ సీట్లు కలవు. బయట ఎంత వేడి ఉన్నా ఈ కారు తట్టుకునే సామర్థ్యం ఉంది. దీని ధర రూ.11.60 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.

కియా సోనెట్:
Kia Sonet 998 సీసీ నుంచి 1493 వరకు ఉంది. డీజిల్, పెట్రోల్ రెండూ ఇంజిన్లతో సౌకర్యవంతంగా ఉంటుంది. లీటర్ కు 18.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 8.86 బీహెచ్ పీ సామర్థంతో కూడిన ఈ కారులోనూ వెంటిలేటేడ్ సీట్లు కలవు. దీని ధర రూ.12.75 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వేసవిని తట్టుకుని నిలబడే కార్లలో ఇదొకటి.

మారుతి సుజుకి ఆల్టా ప్లస్:
బూట్ స్పేస్ 209 లీటర్లు కలిగిన అల్టాప్లస్ 1462 సీసీని కలిగి ఉంది. దీని బీహెచ్ పీ పవర్ 101.65. సీటు సామర్థ్యం 6గురు సౌకర్యంగా కూర్చొవచ్చు. పెట్రోల్ ఇంజన్ మాత్రమే కలిగిన దీనిని 13.16 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

హ్యుందాయ్ వెర్నా:
వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే కార్లలో హ్యూందాయ్ వెర్నా ఒకటి. 1482 సీసీ కలిగిన దీని బీహెచ్ పి పవర్ 113.18. పెట్రోల్ ఇంజన్ మాత్రమే కలిగిన ఇది లీటర్ పెట్రోల్ కు 18.6 నుంచి 20.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.10. 90 నుంచి 17.38 లక్షల వరకు విక్రయిస్తున్నారు. సరికొత్త ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ డిజైన్ కలిగిన ఇది వెంటిలేటెడ్ సీట్లను కలిగి ఉంది. దీంతో బయట ఎంత వేడి ఉన్నా చల్లదనాన్ని ఇస్తుంది.