
Shruthi Hasaan : కమల్ హాసన్ వారసురాలిగా పరిశ్రమలో అడుగుపెట్టిన శృతి హాసన్ చాలా బోల్డ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. ఈ స్టార్ లేడీ నచ్చినట్లు బ్రతికేస్తుంది. సొసైటీ గురించి అసలు పట్టించుకోదు. చేసే పని ఏదైనా నిస్సంకోచంగా చేస్తుంది. అరంగేట్రంలోనే మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించారు. లక్, డి డే వంటి చిత్రాల్లో శృతి హద్దులు మీరి బోల్డ్ సీన్స్ చేశారు. ఇక ఎఫైర్స్ విషయంలో కూడా అదే తీరు. శృతి హాసన్ పలువురు హీరోలతో ఎఫైర్ నడిపారన్న వాదనలు ఉన్నాయి. లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో శృతి పబ్లిక్ గా రిలేషన్ నడిపింది.
2019లో అతనికి బ్రేకప్ చెప్పింది. గత రెండేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు ముంబైలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. శాంతనుతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు శృతి హాసన్ షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులకు శృతి హాసన్ అందుబాటులో ఉంటారు. తాజాగా ఆమె ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ చిట్ చాట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ఆన్లైన్ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
ఈ క్రమంలో దారుణమైన కొన్ని వ్యక్తిగత విషయాలు అడగ్గా… శృతి హాసన్ మొహమాటం లేకుండా సమాధానం చెప్పారు. మీరు యూరిన్ స్మెల్ చూశారా? స్నానం చేస్తూ యూరిన్ పోసుకున్నారా? వంటి జుగుప్సాకరమైన ప్రశ్నలు అడిగారు. దానికి నేను స్నానం చేస్తూ యూరిన్ చేశాను. స్మెల్ అయితే చూడలేదని పచ్చిగా చెప్పింది. మరో నెటిజన్ మీరు వర్జినా? అని అడగ్గా శృతి అస్పష్టంగా సమాధానం చెప్పారు. కేవలం నన్ను సిల్లీ ప్రశ్నలు మాత్రమే అడగండి అంటూ సమాధానం చెప్పారు.
శృతి ఆన్లైన్ చాట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది శృతికి మంచి ఆరంభం లభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ షేక్ చేసింది. కమ్ బ్యాక్ అనంతరం శ్రుతికి భారీ హిట్ పడింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ కి జంటగా సలార్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.