https://oktelugu.com/

‘Rangamarthanda’ Review : ‘రంగమార్తాండ’ మరో ‘బలగం’ అవ్వబోతుందా..అదిరిపోయిన ప్రీమియర్ షో టాక్!

‘Rangamarthanda’ Review : టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన కృష్ణవంశీ గత కొంతకాలం నుండి ఎలాంటి సినిమాలు కూడా విడుదల చెయ్యలేదు.2017 వ సంవత్సరం లో ఈ దర్శకత్వం నుండి విడుదలైన ‘నక్షత్రం’ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు విడుదల చెయ్యలేదు.అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన నుండి వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’.ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ మరియు బ్రహ్మానందం వంటి నటులతో ఆయన ఈ సినిమాని తెరకెక్కించాడు. మరాఠి […]

Written By: , Updated On : March 16, 2023 / 08:34 PM IST
Follow us on

‘Rangamarthanda’ Review : టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన కృష్ణవంశీ గత కొంతకాలం నుండి ఎలాంటి సినిమాలు కూడా విడుదల చెయ్యలేదు.2017 వ సంవత్సరం లో ఈ దర్శకత్వం నుండి విడుదలైన ‘నక్షత్రం’ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు విడుదల చెయ్యలేదు.అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన నుండి వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’.ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ మరియు బ్రహ్మానందం వంటి నటులతో ఆయన ఈ సినిమాని తెరకెక్కించాడు.

మరాఠి లో సూపర్ హిట్ గా నిల్చిన ‘నట సామ్రాట్’ అనే చిత్రానికి రీమేక్ గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది.ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షోస్ ఇప్పటికే పలు చోట్ల వెయ్యగా , మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.కృష్ణ వంశీ మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తేస్తున్నారు.ఇంత గొప్ప ఎమోషన్స్ తో ఈమధ్య కాలం లో వచ్చిన ఏకైక మంచి చిత్రం ఇదేనంటూ మెచ్చుకుంటున్నారు.

రివ్యూస్ అయితే మంచిగానే వచ్చాయి, కానీ ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు కచ్చితంగా థియేటర్స్ లో మిస్ అవ్వకూడని చిత్రమైతేనే ఇప్పుడు థియేటర్స్ కి కదులుతున్నారు.లేకుంటే ఒక నెల రోజులు ఆగితే ఓటీటీ లో విడుదల అయిపోతుంది, అక్కడ చూసుకోవచ్చులే అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నారు.’రంగమార్తాండ’ చిత్రం కూడా అలాగే ఉండబోతుందా, లేదా రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ సినిమా లాగ కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉంది.ఈ చిత్రం లో బ్రహ్మానందం ని కామెడీ రోల్ కి కాకుండా, కనీళ్ళు రప్పించే ఎమోషనల్ పాత్ర ని చేయించాడట.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చారు.మార్చి 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రివ్యూ షోస్ టాక్ ని మ్యాచ్ చేస్తుందో లేదో చూడాలి.