
Shruti Haasan: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆల్ టైం టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.ఈమె ‘వాల్తేరు వీరయ్య’ మూవీ కి సంబంధించి ఎలాంటి ప్రొమోషన్స్ లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ మరియు సక్సెస్ మీట్ లో కానీ పాల్గొనలేదు.
అప్పట్లో ఆమె పాల్గొనకపోవడానికి కారణం జ్వరం అని చెప్పుకొచ్చారు.ఫ్యాన్స్ కూడా అది నిజం అనుకోని నమ్మారు.కానీ రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘వాల్తేరు వీరయ్య’ మూవీ టీం మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.అది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘ఈమధ్యనే నేను నటించిన ఒక సినిమాకి సంబంధించిన పాట షూటింగ్ మంచు కొండల్లో జరిగింది.అక్కడ నేను స్లీవ్ లెస్ జాకెట్ ని ధరించాను, రక్తం గడ్డ కట్టే చలిలో నేను నరకం అనుభవించాను.కానీ హీరో గారికి మాత్రం చలిని తట్టుకోవడానికి జాకెట్ ఇచ్చారు, నేను మాత్రం స్లీవ్ లెస్ తోనే షూటింగ్ చేశాను.డైరెక్టర్స్ కి నా విన్నపం ఒక్కటే, భవిష్యత్తులో ఇలాంటి లొకేషన్స్ లో నన్ను షూటింగ్ చెయ్యమని మాత్రం ఒత్తిడి చెయ్యకండి, ఇక నావల్ల కాదు’ అంటూ చెప్పుకొచ్చింది.
వాస్తవానికి మూవీ టీం విడుదల చేసిన మేకింగ్ వీడియో లో శృతి హాసన్ కేవలం షాట్ అప్పుడు మాత్రమే స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుంది.మిగిలిన టైం మొత్తం ఆమె శరీరాన్ని కప్పుకొని కూర్చుంది, అయినా కానీ ఇలాంటి ఆరోపణలు చెయ్యడానికి కారణం ఏంటో అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.ఆమె ఎలా మాట్లాడిందో మీరే చూడండి క్రింది వీడియోలో.
Shes got a point🤷♂️… pic.twitter.com/VuFU5INajT
— Aryan (@Pokeamole_) April 8, 2023