Shruti Haasan: శృతి హాసన్ పరిశ్రమకు వచ్చి దాదాపు 14 ఏళ్ళు అవుతుంది. హీరోయిన్ గా ఆమె మొదటి చిత్రం లక్ 2009లో విడుదలైంది. తాజా ఇంటర్వ్యూలో శృతి హాసన్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా ఫస్ట్ మూవీ లక్ విడుదలై 14 ఏళ్ళు అవుతుంది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో నా సింగింగ్ కెరీర్ గురించి ఎక్కడ మాట్లాడవద్దన్నారు. హీరోయిన్ గా ఎదిగేందుకు అది ఆటంకం అవుతుంది. ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. అవేమీ నేను పట్టించుకోలేదు. నేను ప్రొఫెషనల్ సింగర్ అన్న విషయం దాచలేదన్నారు.

శృతి మల్టీ టాలెంటెడ్. ఆమె ప్రొఫెషనల్ సింగర్. మ్యూజిక్ కంపోజింగ్, రైటింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు రెండూ విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు విజయం సాధించడం గొప్ప విషయమని శృతి అన్నారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించడం, అవి ఒకేసారి విడుదల కావడం, రెండూ విజయం సాధించడం అరుదైన విషయమని శృతి అన్నారు. ఆ అదృష్టం తనకు దక్కిందని మురిసిపోయారు.
ముఖ్యంగా వాల్తేరు వీరయ్య భారీ హిట్ కొట్టింది. రెండు వందలకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ వైపు అడుగులు వేస్తుంది. వాల్తేరు వీరయ్య మూవీలో శృతి హాసన్ రా ఏజెంట్ గా నటించడం విశేషం. ఆమెకు ఓ పవర్ ఫుల్ పాత్ర దక్కింది. శృతి యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసింది. అలాగే వీరసింహారెడ్డి డీసెంట్ హిట్ సొంతం చేసుకుంది. బాలయ్యకు మాత్రం అతిపెద్ద విజయమని చెప్పాలి. వీరసింహారెడ్డి ఆయన గత హిట్ అఖండ వసూళ్లను బ్రేక్ చేయడం విశేషం. పండగ సీజన్ వాల్తేరు, వీరసింహారెడ్డి చిత్రాలకు బాగా కలిసొచ్చింది.

ఈ మధ్య కాలంలో శృతి టాలీవుడ్ లో నటించిన చిత్రాలన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఆమె బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ కి జంటగా సలార్ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సలార్ చిత్రం మీద పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. సలార్ తో పాటు ది ఐ టైటిల్ తో ఓ ఇంగ్లీష్ మూవీ చేస్తున్నారు.