Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తో ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు తను తీయబోయే ఏ సినిమా అయినా దేశవ్యాప్తంగా ఆడుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ లో నటనకు గాను ఆస్కార్ బరిలో కూడా నిలుస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని ప్రకటించారు. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈనెలలోనే సెట్స్ లోకి వెళ్లబోతున్నట్టు టాక్. అయితే సడెన్ గా జూనియర్ ఎన్టీఆర్ ఆ సర్జరీకి వెళ్లబోతున్నాడని.. ఈ సినిమా ఆలస్యం కానుందని ప్రచారం సాగుతోంది.
‘యమ దొంగ’ సినిమాకు ముందు వరకూ బాగా లావుగా ఉన్న ఎన్టీఆర్ ను కొవ్వు కరిగించే ‘లైపోసెక్షన్’ ఆపరేషన్ ను చేయించుకోమని రాజమౌళి హుకూం జారీ చేశారు. దీంతో అమెరికా వెళ్లి మరీ ఆ ఆపరేషన్ చేసుకొని జూ.ఎన్టీఆర్ సన్నబడ్డారు.
తాజాగా ఎన్టీఆర్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నాడని.. ఆ సర్జరీ కోసం మరోసారి అమెరికా వెళ్లబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ముఖం మొత్తం గడ్డంతో నిండి కనిపిస్తుండడం.. కాస్త ముదురు ఛాయలు తగ్గించుకోవడానికి ఈ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళుతున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమా? నిజంగానే ఎన్టీఆర్ ప్లాస్టిక్ సర్జరీకి వెళుతున్నాడా? ఇది రూమరా? అన్నది తెలియాల్సి ఉంది.