Homeఎంటర్టైన్మెంట్Rajamouli- Brahmastra: రాజమౌళి ఊరికే బ్రహ్మాస్త్రంను ప్రమోట్ చేయడంలా... ఆయన లెక్కలు ఆయనకున్నాయి!

Rajamouli- Brahmastra: రాజమౌళి ఊరికే బ్రహ్మాస్త్రంను ప్రమోట్ చేయడంలా… ఆయన లెక్కలు ఆయనకున్నాయి!

Rajamouli- Brahmastra: మహానుభావులు ఊరికే ఏదీ చేయరంటారు. రాజమౌళి బ్రహ్మాస్త్రం చిత్రాన్ని భుజాన వేసుకొని మోస్తుండగా ఆయన ఎందుకు ఇంతలా కష్టపడుతున్నారో అర్థం కావడం లేదు. అయితే దాని వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది బ్రహ్మాస్త్రం. దాదాపు రూ. 400 కోట్లకు పైగా బుడ్జెట్ తో కరణ్ జోహార్ నిర్మించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. బ్రహ్మాస్త్రం విజయం సాధించడం బాలీవుడ్ కి చాలా అవసరం. ఈ సినిమా కూడా నిరాశ పరిస్తే పరిశ్రమ మరింత అగాధంలోకి జారుకోవడం ఖాయం.

Rajamouli- Brahmastra
Rajamouli

హిందీతో పాటు సౌత్ ఇండియాలో భారీగా సక్సెస్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. దీని కోసం రాజమౌళి సహాయం తీసుకున్నారు. బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్ రాజమౌళి అన్నీ తానై నిర్వహిస్తున్నాడు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి శతవిధాలా కృషి చేస్తున్నాడు. ఎన్టీఆర్ గెస్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమౌళి ఏర్పాటు చేశాడు. అనుకోని కారణాలతో అది క్యాన్సిల్ అయ్యింది. చేసేది లేక ఎన్టీఆర్ ని పిలిచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Also Read: Bigg Boss Telugu Season 6: బిగ్ బాస్ కార్యక్రమంలో అధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

ఇక బ్రహ్మాస్త్రం హీరో హీరోయిన్స్ రన్బీర్ కపూర్, అలియా భట్ బిగ్ బాస్ 6 గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అలాగే సుమ క్యాష్ షోకి కూడా రావడం జరిగింది. ఇవన్నీ రాజమౌళి ఆలోచలని సమాచారం. సినిమా ప్రమోషన్స్ నిర్వహించడంలో, హైప్ తేవడంలో రాజమౌళికి మించినవాడు లేడు. ఆయన్ని పెద్ద మార్కెటింగ్ జీనియస్ గా అభివర్ణించవచ్చు. ఆ విషయం అటుంచితే రాజమౌళి బ్రహ్మాస్త్రం ప్రమోషన్స్ సీరియస్ గా తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. బ్రహ్మాస్త్రం తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం.

Rajamouli- Brahmastra
Brahmastra

బ్రహ్మాస్త్రం కంటెంట్ పై నమ్మకం ఉన్న రాజమౌళి తన మిత్రుడు బళ్లారి సాయితో కలిసి ఈ భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఈ క్రమంలో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసి విజయం అందుకోవాలనేది ఆయన పక్కా ప్లాన్ అట. బాలీవుడ్ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం మార్కెట్ లేదు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి హీరోల చిత్రాలు కూడా ఆదరణ దక్కించుకోవడం లేదు. అందుకే రాజమౌళి బ్రహాస్త్రం సక్సెస్ ని సీరియస్ గా తీసుకున్నారట. మరి రాజమౌళి ప్రయత్నాలు ఎలాంటి ఫలితం ఇస్తాయో చూడాలి. ప్రాధమికంగా బుకింగ్స్ బాగానే ఉన్నట్లు సమాచారం. బ్రహ్మాస్త్రం మూవీలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ నటిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:Samantha: కలిసి రాకున్నా అదే పని చేస్తానుంటున్న సమంత… అందరిలాంటి అమ్మాయి కాదుగా!

 

బిగ్ బాస్ 6 కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్ | Nagarjuna Remuneration For Bigg Boss Season 6

 

చెడుగుడు ఆడేసిన లేడీ పుష్ప గీతూ | Lady Pushpa Geethu Fires On Inaya Sultana | Bigg Boss Season 6

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version