Bigg Boss Rajasekhar: బిగ్ బాస్ 6 ఘనంగా లాంచ్ అయ్యింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 21 మందిని ఇంటిలోకి పంపించి కింగ్ నాగార్జున ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి రెడీ అయ్యారు. ఈసారి కొంచెం మెరుగైన కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. టీవీ రంగం, సినీ పరిశ్రమ, మోడలింగ్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిని ఈసారి ఎంపిక చేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి మోడలింగ్ రంగం నుంచి రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్ లలో అలీ రెజా, అనిల్ రాథోడ్, జెస్సీలను ఇలాగే తీసుకున్నారు. ఈసారి రాజశేఖర్ కు అవకాశం కల్పించారు.
రాజశేఖర్ ది హైదరాబాద్. ఇక్కడే చదువు పూర్తి చేశాడు. మొదట ఆఫీస్ బాయ్ గా ఆ తర్వాత అడ్వైజర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత మోడలింగ్ స్ట్రాట్ చేశాడు. 2018లో టైమ్స్ నౌ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ విజేతగా నిలిచారు.

రాజశేఖర్ ఈ మోడల్ గా ఎదగడానికి అష్టకష్టాలు పడ్డాడట.. ఆఫీస్ బాయ్ గా కెరీర్ ప్రారంభించిన రాజశేఖర్ ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ‘కల్యాణ వైభోగం’, మనసు మమత’ వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మేజర్’ సినిమాలోనూ రాజశేఖర్ నటించాడు.
ఇక గత బిగ్ బాస్ సీజన్ విజేత సన్నీకి రాజశేఖర్ బెస్ట్ ఫ్రెండ్ అట. అతడి రికమండ్ తోనే రాజశేఖర్ కు బిగ్ బాస్ అవకాశం దక్కిందని టాక్. మోడలింగ్ రంగంలోకి వచ్చిన వారికి మంచి గుర్తింపు దక్కడంతో ఇప్పుడు రాజశేఖర్ కూడా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడట