https://oktelugu.com/

Shekhar Master : ఛాన్స్ ఇచ్చిందని శ్రద్దా దాస్ ని నలిపేసిన శేఖర్ మాస్టర్… అందరూ షాక్!

ఇటీవల ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణంపై శ్రద్దా దాస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చైతన్యతో ఉన్న అనుభంధాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2023 / 05:38 PM IST
    Follow us on

    ఢీ షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఛాన్స్ ఇచ్చిందని శ్రద్దా దాస్ తో గట్టిగా రొమాన్స్ చేశాడు శేఖర్ మాస్టర్. ఈ వీడియో పిచ్చ వైరల్ గా మారింది. పాపులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా హీరోయిన్ శ్రద్దా దాస్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ సీజన్లో శేఖర్ మాస్టర్ రీ ఎంట్రీ ఇచ్చారు. గత రెండు సీజన్స్ లో ఆయన కనిపించలేదు. ప్రస్తుతం శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా చేస్తున్నారు. ఈ షోలో వీరిద్దరూ కలిసి ఒక సాంగ్ చేశారు. సర్కారు వారి పాట చిత్రంలోని ‘కళావతి’ సాంగ్ కి స్టెప్స్ వేశారు.

    ఈ రొమాంటిక్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ రెచ్చిపోయారు. శ్రద్దా దాస్ ని దగ్గరకు తీసుకుంటూ హీటు పెంచేశాడు. ఆమెను ఏకంగా చేతులతో ఎత్తుకొని గాల్లో తిప్పాడు. శేఖర్ మాస్టర్ అలా చేస్తాడని ఊహించలేదేమో శ్రద్దా దాస్ తో పాటు షో యాంకర్స్ ప్రదీప్, హైపర్ ఆది, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ షాక్ అయ్యారు. ఫైనల్ గా శేఖర్ మాస్టర్-శ్రద్దా దాస్ పెర్ఫార్మన్స్ ని ఉద్దేశిస్తూ హైపర్ ఆది కామెంట్ చేశాడు. శ్రద్దా దాస్ మాటలను ఇమిటేట్ చేస్తూ… ఇవాళ చిత్తడి చిత్తడి అయిపోయింది.. అన్నాడు. మొత్తంగా శేఖర్ మాస్టర్ తీరు హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇదంతా షోకి హైప్ తేవడం కోసమే. ఢీ షోలో జరిగే సంగతులన్నీ స్క్రిప్టెడ్.

    కాగా ఇటీవల ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మరణంపై శ్రద్దా దాస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చైతన్యతో ఉన్న అనుభంధాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ సైతం బాధపడ్డారు. చైతన్య అలా చేయాల్సింది కాదని ఆయన వాపోయారు. మొన్నటి వరకు వాళ్లతో కలిసి పని చేసిన చైతన్య దూరం కావడం వాళ్ళను కలచి వేసింది.

    ఇక శ్రద్దా దాస్ విషయానికి వస్తే.. 2008లో వెండితెరకు పరిచయమయ్యారు. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈమె మొదటి చిత్రం. ఆర్య 2, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాల్లో ఆమె వ్యాంప్ రోల్స్ చేశారు. శ్రద్దా దాస్ హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఆమెకు సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. 2021లో ఏక్ మినీ కథ చిత్రంలో శ్రద్దా దాస్ బోల్డ్ రోల్ చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఢీ జడ్జిగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షోటోస్ చేస్తుంటారు.