Stalin DMK Files : తమిళనాడులో మళ్లీ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం స్టాలిన్ అల్లుడైన జీ-స్వైర్ రియల్ ఎస్టేట్ చైర్మన్ శబరిషన్ పై ఐటీ దాడులు 5 రోజులుగా సాగుతున్నాయి. దీన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బయటపెట్టడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి ఈ దాడులు జరుగుతున్నాయి.
ఈ జీస్వైర్ అనేది 2021 ముందు వరకూ లేదు. దాని క్యాపిటల్ కేవలం లక్ష రూపాయలలోపే ఉండేది. డీఎంకే అధికారంలోకి వచ్చాక 2వేల కోట్ల ఆదాయానికి ఈ సంస్థ పెరిగింది. ఎలా పెరిగిందన్నది ఆసక్తి రేపుతోంది.
సొంత పార్టీ నేత, అందులోనూ ఆర్థిక శాఖ మంత్రి అలా మాట్లాడటం స్టాలిన్ కు మింగుడు పడకుండా మారింది. కానీ స్టాలిన్ ఒక్క మాట కూడా దీని గురించి మాట్లాడటం లేదు. ఈ శబరీషన్ ఎవరో కాదు.. స్టాలిన్ కూతురు సెంథామరై భర్త. శబరీషన్, సెంథామరై ది వివాహం. అయితే సెంథామరైకి చెన్నైలో ఒక స్కూల్ ఉండేది. శబరీషన్ మొదట్లో ఆ స్కూల్ నిర్వహణ చూసుకునేవాడు. తర్వాత మామకు దగ్గరయ్యాడు.. అనివార్యంగా తన మీద ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చాడు.. అంతేకాదు వ్యక్తిగతంగా శబరీషన్ కలుపుగోలు వ్యక్తి. అన్నా డీఎంకే, జనతా పార్టీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సత్సంబంధాలు నెరిపేవాడు. ఎన్నికల సమయంలో ఉదయనిది స్టాలిన్ అవసరం లేకుండానే స్టాలిన్ కు అన్ని తానయ్యాడు. ఎన్నికల మేనేజ్మెంట్, ప్రచారం.. ఇలా ఒక్కటేమిటి అన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించాడు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా తన పోరాటం విరమించలేదు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత త్యాగరాజన్ ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు..
త్యాగరాజన్ కూడా తక్కువ వాడేమి కాదు. ఆయన కూడా దర్జాగా వెనకేశాడు. ఒకానొక సందర్భంలో స్టాలిన్ కొడుకు, అల్లుడు 30 వేల కోట్ల దాకా నొక్కేశారని మాట తూలాడు.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అయితే తన పేరుతో వైరల్ అవుతున్న ఆడియో కల్పితం అని ట్వీట్ చేశాడు. అయితే ఆడియో క్లిప్ నిజంగా.. ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిగ్గు తేలిస్తే ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దాన్ని కడుక్కోవాల్సి ఉంటుంది. ఆ క్లిప్ లో మాటలు ఆర్థిక శాఖ మంత్రివే కాబట్టి దానిని తెలివిగా డైవర్ట్ చేసేందుకు ట్వీట్ చేశాడు అంటున్నారు బీజేపీ నాయకులు. ఆర్థిక శాఖ మంత్రి వెనుకంజ వేశాడు అంటే క్లిప్ లో మాటలు తనవే అని ఒప్పుకున్నాడని బిజెపి నాయకులు అంటున్నారు. ఈ ఆడియో క్లిప్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తను మామూలు వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్. ఫేక్ ఆడియో షేర్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో అతడికి తెలుసు. ఈ ఆడియో క్లిప్ షేర్ చేయడంపై డీఎంకే పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు.
ఈ నేపథ్యంలోనే G-Squareపై ఇంకా కొనసాగుతున్న దాడులు, నిర్మలా సీతారామన్ తో స్టాలిన్ భేటీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు..