https://oktelugu.com/

Shanmukh: బ్రేకప్ తర్వాత దీప్తి ఫొటోను షేర్ చేసిన షణ్నుఖ్.. వైరల్..!

Shanmukh: తెలుగులో ‘బిగ్ బాస్’ రియల్టీ షోకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో ఈ షో నెగిటీవీని కూడా సొంతం చేసుకుంది. ఈ షోను ఆదరించే వారు ఎంతమంది ఉన్నారో? అలాగే ట్రోల్స్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం. అయితే ఈ షో కారణంగా ఓ ప్రేమజంట విడిపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. విశేషం ఏంటంటే వీరద్దరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్సే. అయితే వీరివురు వేర్వేరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 10, 2022 / 11:45 AM IST
    Follow us on

    Shanmukh: తెలుగులో ‘బిగ్ బాస్’ రియల్టీ షోకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో ఈ షో నెగిటీవీని కూడా సొంతం చేసుకుంది. ఈ షోను ఆదరించే వారు ఎంతమంది ఉన్నారో? అలాగే ట్రోల్స్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం. అయితే ఈ షో కారణంగా ఓ ప్రేమజంట విడిపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

    Shanmukh Deepthi Sunaina

    విశేషం ఏంటంటే వీరద్దరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్సే. అయితే వీరివురు వేర్వేరు సీజన్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆ ప్రేమజంట ఎవరో మీకు అర్థమై ఉంటుంది. వారిద్దరే షణ్ముఖ్ జస్వంత్ అండ్ దీప్తి సునైనా. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్నుఖ్ జస్వంత్, దీప్తి సునైనాలు గత ఐదేళ్లుగా రిలేషన్లో ఉంటున్నారని తెలుస్తోంది.

    బిగ్ బాస్-5 సీజన్ ముగిసేంత వరకు కూడా వీరిద్దరి బంధం సాఫీగానే సాగింది. ‘బిగ్ బాస్-5’ నడుస్తున్న సమయంలో దీప్తి సునైనా షణ్నుఖ్ కు తన ప్రేమను తెలియ జేసింది. షణ్నుఖ్ కు  ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పింది. అయితే ఈ షోలో సిరి, షణ్నుఖ్ ప్రవర్తనతో విసిగిపోయిన దీప్తి సునైనా అతడితో ‘బిగ్ బాస్’ ముగిశాక బ్రేకప్ చెప్పింది.

    మరోవైపు సిరి బాయ్ బ్రాండ్ శ్రీహర్ష సైతం ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. వీరిద్దరు కూడా విడిపోయాయనే వార్తలు వస్తున్నారు. దీంతో రెండు జంటలను బిగ్ బాస్ విడదిసీందనే కామెంట్స్ వస్తున్నాయి. దీప్తితో బ్రేకప్ షణ్నుఖ్ కు ఇష్టం లేకపోయినా సరే ఆమె అభిప్రాయం మేరకు విడిపోయినట్లు చెప్పాడు.

    అయితే బ్రేకప్ తర్వాత తొలిసారి దీప్తి సునైనా ఫొటోను షణ్నుఖ్ తన ఇన్ స్ట్రాలో పోస్టు చేయగా ఇది క్షణాల్లో వైరల్ గా మారింది. నేడు దీప్తి సునైనా పుట్టిన రోజు కావడంతో ‘హ్యాపీ బర్త్‌డే డీ(D)’ అంటూ దీప్తితో కలిసి దిగిన ఓ పాత పిక్ ను షణ్నుఖ్ షేర్‌ చేశాడు. ఈ ఫొటోకు గతంలో వీరిద్దరు కలిసి నటించిన ‘మలుపు’ సిరీస్‌ సాంగ్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.