January 10: రోజూ చెప్పుకున్నట్టే.. చరిత్రలో ప్రతీరోజు ఏదొక ఓ ప్రత్యేకమైన సంఘటనను కలిగి ఉంటుంది. అందుకే.. ప్రతి రోజుకు ఉండే ఆ ప్రత్యేకతలు మీ కోసం. ఇక ఈ జనవరి 10 నాడు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.
లండన్ లో భూగర్భ రైల్వే ప్రారంభం. కరెక్ట్ గా ఇదే రోజు 1863లో ప్రారంచించారు. లండన్ కే ఇది అప్పట్లో ఎంతో గర్వకారణం గా నిలిచింది.
తెలుగు మహా కవి పింగళి లక్ష్మీకాంతం 1894లో ఇదే రోజు 1934 లో పుట్టారు. 1972లో మరణించారు.
నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది కూడా ఇదే రోజు. 1920లో ఇది జరిగింది.
భారతదేశం ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, మరియు సంగీత విద్వాంసుడు కె. జె. ఏసుదాస్ గారు 1940లో ఇదే రోజు ఆయన పుట్టారు
Also Read: రిషబ్ పంత్ కు ఏమైంది? ఏందుకీ వైఫల్యాలు?
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తొలి సమావేశం లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్ హాలులో కరెక్ట్ గా 1946లో ఇదే రోజున జరిగింది. అన్నట్టు ఈ సమావేశానికి మొత్తం 51 దేశాలు హాజరయ్యాయి. అది అప్పట్లో పెద్ద సంచలనం అయింది కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారో మీకు తెలుసా..? ఇదే రోజున 1973లో విధించారు. ఇప్పటి తరానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టారని కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా చరిత్ర ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. పైగా పైన సంఘటనలు లాంటివి ఇంకా ఆసక్తిగా ఉంటాయి.
Also Read: భారత సైన్యానికి సరికొత్త యూనిఫామ్.. శత్రువుల గుండెల్లో దడ పుట్టేలా..