
Game Changer: భారీ చిత్రాల దర్శకుడు శంకర్-రామ్ చరణ్ కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి ఓ షాకింగ్ ఫ్యాక్ట్ ఆయన రివీల్ చేశారు. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ కి శంకర్ అనుకున్న హీరో చరణ్ కాదట. ఆయన పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట.
దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ వినిపించాక… ఈ కథకు మీరు అనుకుంటున్న హీరో ఎవరు? అని దిల్ రాజు అడిగారట. పవన్ కళ్యాణ్ ని అనుకుంటున్నానని శంకర్ అన్నారట. అయితే దిల్ రాజు రామ్ చరణ్ పేరు సూచించారట. ఇది పొలిటికల్ థ్రిల్లర్. ప్రజాస్వామ్యం అనే అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ స్క్రిప్ట్ చక్కగా సెట్ అవుతుందని శంకర్ నమ్మారు. అదే విషయం దిల్ రాజుకు చెప్పారు.
మరి పవన్ ని కాదని రామ్ చరణ్ పేరు దిల్ రాజు సూచించడం వెనుక కారణాలు ఆయన వెల్లడించడం లేదు. బహుశా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసి, రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సమయంలో గేమ్ ఛేంజర్ మూవీకి డేట్స్ కేటాయించలేక పోవచ్చని ఆయన భావించి ఉండొచ్చు. గతంలో దిల్ రాజు-పవన్ కాంబోలో వకీల్ సాబ్ తెరకెక్కింది. ఇక శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు పొలిటికల్ థ్రిల్లర్స్ లో ఐకానిక్ మూవీగా ఉంది. ఆ మూవీలో శంకర్ చెప్పిన ఒక్క రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ కి భారీ రెస్పాన్స్ దక్కింది.

మరి ఒకే ఒక్కడు షేడ్స్ గేమ్ ఛేంజర్ మూవీలో చూడొచ్చా అని అడగ్గా… ఈ మూవీ గురించి ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని దిల్ రాజు అన్నారు. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం అవుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.