
Shani Effect 2023: మనదేశంలో జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం రాశిచక్రంలో తన గమనాన్ని మార్చుకుంటుంది. శని గ్రహం ముప్పై ఏళ్ల తరువాత జనవరి 17న కుంభ రాశిలోకి ప్రవేశించాడు. దీంతో పలు రాశుల గతి మారనుంది. మార్చి 15న శని నక్షత్రం మారింది. రాహువు శతబిష నక్షత్రంలోకి శని ప్రవేశించాడు. దీంతో శని, రాహువు మధ్య ఉన్న స్నేహం కారణంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతోంది. కొన్ని రాశులకు మాత్రం ఆకస్మిక ధనలాభం కలగజేస్తున్నాడు. వీరికి మంచి రోజులు రానున్నాయి.
మేష రాశి
జ్యోతిష్యం ప్రకారం శని మేష రాశి వారికి ఎంతో మేలు చేస్తోంది. శని దేవుడే అధిపతిగా ఉండటంతో వీరికి లాభాలు కలుగుతున్నాయి. వీరి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కే వీలుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. జూదం, బెట్టింగ్, మద్యం తదితర వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
మిథున రాశి
శని గ్రహం ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తోంది. బుధ గ్రహతో శనికి ఉన్న స్నేహం కారణంగా వీరికి లాభాలు కలుగుతున్నాయి. తొమ్మిదో ఇంటికి అధిపతిగా శని ఉంటున్నాడు. వీరికి విదేశీయానం చేసే అవకాశం ఉంది. రహస్య మార్గాల్లో డబ్బు వీరి చేతికి అందుతుంది. దీంతో ఈ రాశివారికి అన్ని విషయాల్లో కలిసొస్తుంది. ప్రయాణాల్లో వీరికి బాధలు కలిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. మొత్తానికి శని వల్ల వీరికి మంచి యోగమే కలుగుతోంది.
సింహ రాశి
శని వల్ల సింహ రాశి వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి. వీరి జాతకంలో ఆరో మరియు ఏడో ఇంటికి అధిపతి అయిన శని వైవాహిక జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తున్నాడు. ఆదాయ వనరులు బాగున్నాయి. భాగస్వామితో పనిచేయాలనే ఆలోచన వస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అన్నింట్లో విజయమే లభిస్తుంది.

తుల రాశి
శని గ్రహం శతబిష నక్షత్రంలోకి మారడం వల్ల ఈ రాశి వారికి బాగుంటుంది. శని దేవుడు ఆదాయ స్థానంలో ఉండటంతో రాజయోగం ఏర్పడుతుంది. అన్ని మార్గాల్లో కూడా మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి. సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో శని దేవుడి వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు కలుగుతుంది. శని సంచారం వీరికి మంచి లాభాలు కలగజేస్తోంది. ఏది అనుకున్నా అది నెరవేరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి యోగాలు దక్కుతున్నాయి.