https://oktelugu.com/

Naresh – Pavitra Lokesh: షాక్… నరేష్- పవిత్ర పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారా? అప్పట్లో ఎన్టీఆర్ కూడా లేటు వయసులో!

Naresh – Pavitra Lokesh: లేటు వయసులో ఒక్కటైన జంట పవిత్ర లోకేష్-నరేష్. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్ళు ఉంది. నరేష్ సిక్స్టీ ప్లస్ కాగా పవిత్ర లోకేష్ ఫార్టీ ప్లస్ లో ఉన్నారు. దాదాపు నాలుగేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. సన్నిహితులకు మాత్రమే వీరి సంగతి తెలుసు. గత ఏడాది రిలేషన్ బయటపెట్టారు. మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ ఆలయాన్ని జంటగా సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఫోటోలు మీడియాలో వైరల్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 4, 2023 / 05:45 PM IST
    Follow us on

    Naresh – Pavitra Lokesh

    Naresh – Pavitra Lokesh: లేటు వయసులో ఒక్కటైన జంట పవిత్ర లోకేష్-నరేష్. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 20 ఏళ్ళు ఉంది. నరేష్ సిక్స్టీ ప్లస్ కాగా పవిత్ర లోకేష్ ఫార్టీ ప్లస్ లో ఉన్నారు. దాదాపు నాలుగేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. సన్నిహితులకు మాత్రమే వీరి సంగతి తెలుసు. గత ఏడాది రిలేషన్ బయటపెట్టారు. మహారాష్ట్రలో గల మహాబలేశ్వర్ ఆలయాన్ని జంటగా సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. నరేష్ నాలుగో వివాహం చేసుకున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి.

    పెళ్లి చేసుకోలేదు సహజీవనం చేస్తున్నామని నరేష్ వివరణ ఇచ్చారు. గత ఏడాది చివర్లో త్వరలో వివాహం అంటూ నరేష్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. పవిత్రను ముద్దాడుతూ ఓ రొమాంటిక్ వీడియో షేర్ చేశారు. ఇటీవల పెళ్లి వీడియో పోస్ట్ చేశాడు. గతంలో వివాహం చేసుకోబుతున్నామని ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ పెళ్లి వీడియో సంచలనమైంది. నరేష్ నాలుగో వివాహం చేసుకుని పవిత్ర లోకేష్ తో తన బంధం అధికారికం చేసుకున్నారని అందరూ భావించారు. అయితే అది ఓ మూవీ ప్రమోషన్ లో భాగమని స్పష్టత వచ్చింది.

    ఎం ఎస్ రాజు డైరెక్షన్ లో పవిత్ర లోకేష్-నరేష్ జంటగా ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రం చేస్తున్నారు. ఆ మూవీలో సన్నివేశమే పెళ్లి ఎపిసోడ్ అని సమాచారం. అసలు నిజంగా పెళ్లి చేసుకుని దాన్ని సినిమాగా చిత్రీకరిస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం నరేష్-పవిత్ర సంతానం కోరుకుంటున్నారట. దీని కోసం వారు పలు ప్రయత్నాలు చేస్తున్నారట. పూజలు పునస్కారాలు కూడా నిర్వహిస్తున్నారట. ఎలాగైనా తమ ప్రేమకు గుర్తుగా బాబో, పాపనో కనాలని గట్టి పట్టుదలతో ఉంటున్నారట.

    Naresh – Pavitra Lokesh

    దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అదే సమయంలో మొక్కులు మొక్కుతున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నందమూరి తారక రామారావు లేటు వయసులో సంతానం కోరుకున్నారనే ప్రచారం ఉంది. ఓ జ్యోతిష్కుడు లక్ష్మి పార్వతితో మీకు కలిగే సంతానం కారణజన్ముడు అవుతాడని చెప్పారట. అందుకే ఆయన మరో వారసుడ్ని కోరుకున్నారట. దీన్ని లక్ష్మి పార్వతి కొన్ని సందర్భాల్లో ధృవీకరించడం విశేషం. ఇక నరేష్ ఆల్రెడీ ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు భార్యలతో ఒక్కోకొడుకు చొప్పున కన్నారు.