Shaakuntalam Release Date: పాన్ ఇండియా రేంజ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ సమంత. అనుష్క నిశ్శబ్దం పేరుతో పాన్ ఇండియా మూవీ చేసినప్పటికీ నిరాశపరిచింది. సమంత మాత్రం యశోదతో హిట్ కొట్టింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద హిట్ టాక్ తెచ్చుకొని లాభాలు పంచింది. మయోసైటిస్ తో బాధపడుతూనే యశోద చిత్ర ప్రమోషన్స్ లో సమంత పాల్గొన్నారు. యశోద కంటే ముందు ప్రకటించిన శాకుంతలం ఇంకా విడుదల కాలేదు. ఎట్టకేలకు అధికారికంగా విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 17న యశోద వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. నేడు చిత్ర యూనిట్ రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు.

గత ఏడాది చివర్లో శాకుంతలం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. దర్శకుడు గుణశేఖర్ దర్శక నిర్మాతగా శాకుంతలం మూవీ తెరకెక్కిస్తున్నారు. ఆయన కుమార్తె నీలిమ గుణ నిర్మాణ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇటీవల నీలిమ గుణ వివాహం ఘనంగా జరిగింది. చిత్ర ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కుతుంది. సమంతకు జంటగా మలయాళ నటుడు మోహన్ దేవ్ నటిస్తున్నారు.
షూటింగ్ త్వరిత గతిన పూర్తి చేసిన గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ కి అధిక సమయం తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. శాకుంతలం మూవీలో వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ కీలక రోల్ చేస్తున్నారు. శాకుంతలం చిత్రానికి ఉన్న మరొక విశేషం… బన్నీ గారాలపట్టి అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తుంది. అర్హ నటిస్తున్న మొదటి చిత్రం ఇది. గుణశేఖర్-బన్నీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో అర్హను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింపజేసేందుకు ఒప్పుకున్నాడు.

శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తున్న సమంత విరామం తీసుకున్నారు. ఆమె కెమెరా ముందుకు రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దీంతో బాలీవుడ్ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకున్నట్లు సమాచారం అందుతుంది.