Homeట్రెండింగ్ న్యూస్Bihar: ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులే.. వీరి కథ వింటే కన్నీళ్లే..

Bihar: ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులే.. వీరి కథ వింటే కన్నీళ్లే..

Bihar: ఒకప్పుడు పోలీస్ జాబ్ అనగానే బయపడేవారు. భద్రత కారణాల వల్ల ఈ జాబ్ చేయడానికి ఎక్కువగా ముందుకు వచ్చే వారు కాదు. కానీ రాను రాను పోలీస్ జాబ్ పై అవగాహన పెరగడంతో అబ్బాయిలే కాదు అమ్మాయిలు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి తమదైన ప్రతిభ చూపుతున్నారు. తాజాగా ఓ కుటుంబంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు అమ్మాయిలో పోలీస్ జాబ్ కు సెలక్ట్ అయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరో విశేషం. అయితే వీరు ఊరికే ఈ స్థితికి రాలేదు. వీరు జాబ్స్ రావడం వెనక కన్నీళ్లే ఉన్నాయి. ఆ స్టోరీలోకి వెళ్తే..

బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాలో కమల్ సింగ్ అనే రైతు ఉండేవాడు. ఈయనకు ఒకరి తరువాత మరొకరు మొత్తంగా 8 మంది కుమార్తెలు జన్మించారు. వీరిలో ఒక అమ్మాయి అనారోగ్యంతో మరణించింది. అయితే మిగతా ఏడుగురిని చూసిన ఊళ్లో వారంతా హేళన చేశారు. ఇంత మంది కుామార్తెల జీవితాలు ఎప్పుడు బాగుపడుతాయి? అని చిన్నచూపు చేసేవారు. చుట్టుపక్కల వాళ్లు అనే మాటలకు కమల్ సింగ్ భరించలేక తన కుటుంబం తో సహా సరన్ జిల్లాలోని నాచాప్ గ్రామానికి వలస వచ్చాడు. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు.

అయితే తాను వ్యవసాయం మాత్రమే చేయకుండా తమ కుమార్తెలను ప్రయోజకులుగా చేయాలని అనుకున్నాడు. దీంతో ఇంటి వద్ద పిండి గిర్ని పెట్టి అధిక ఆదాయాన్ని ఆర్జించాడు. ఇలా వచ్చిన డబ్బుతో కూతుళ్లను చదివించాడు. వీరిలో పెద్ద కూతురు శస్త్ర సీమ బల్ ఓ వైపు తండ్రికి సాయంగా ఉంటూనే పోలీస్ జాబ్ కోసం ప్రయత్నించింది. ఈవెంట్స్ ప్రాక్టీస్ లో భాగంగా పొలాల్లో పరుగెత్తింది. ఆ తరువాత కానిస్టేబుల్ జాబ్ కు ఎంపికైంది.

ఈమె ఉద్యోగాన్ని సాధించడం చూసి మిగతా కుమార్తెల్లో పట్టుదల పెరిగింది. అయితే వారు కూడా పోలీసులు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రెండో అమ్మాయి వివాహం అయిన తరువాత కూడా ప్రాక్టీస్ చేసింది. దీంతో 2009లో బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ జాబ్ కు ఎంపికైంది. ఆ తరువాత మిగతా 5గురు కుమార్తెల్లో కొందరు పోలీస్, మరికొందరు పారామిలటరీ ఉద్యోగాలు సాధించారు. అయితే వీరింతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం గమనార్హం. వీరంతా ఉద్యోగాలు పొందడంపై వారి తండ్రి ఆనందానిి అవధుల్లేకుండా పోయింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper
Exit mobile version