Uttar Pradesh Serial killer: మహిళలను ద్వేషించే కొంతమందిని మనం చూస్తుంటాం.. ఒక్కొక్కరు ఒక్కో రీతిన దేషిస్తారు. కొంతమంది సైకోలుగా, సైకో కిల్లర్లుగా కూడా మారుతారు. అయితే ఒక్కో సైకో కిల్లర్‌కు ఒక్కో మోటివ్ ఉంటుంది. వీళ్లు హత్యలు చేసే సమయంలో రాక్షసుల్లా మారతారు. తమ బారినపడిన వారిని అతి క్రూరంగా చంపుతూ ఉంటారు. తాజాగా, ఓ భయంకరమైన సైకో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కుర్ర సైకోకు ఆడవాళ్లను ఒంటరిగా చూడగానే దెయ్యం పడుతుందట. ఇలా తనకు కనిపించిన ముగ్గురు మహిళలను చంపేశాడు. నాలుగో మహిళను చంపే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

ఆడవాళ్లపై ద్వేషంలో..
ఉత్తరప్రదేశ్‌లోని బరబంకీ, అసంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని అమరేంద్ర రావత్‌కు ప్రస్తుతం 20 ఏళ్లు. ఇతడి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే, పిన తల్లి అమరేంద్ర రావత్‌ను సరిగా చూసుకోలేదు. పినతల్లి, తండ్రి తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. రెండో భార్యతో గొడవల కారణంగా తండ్రి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా అమరేంద్రను సరిగా చూసుకునేది కాదు. పినతల్లుల ప్రవర్తన కారణంగా మహిళలు అంటే అతడికి అసహ్యం, దేషం మొదలైంది. వారిని చూస్తే పగతో రగిలిపోయేవాడు.
16 ఏళ్ల వయసులో పెళ్లి..
పినతల్లులపై పెరిగిన ద్వేష భావంతో ఇలా ప్రవర్తిస్తున్నాడని భావించిన గ్రామస్తులు అతడికి పెళ్లి చేస్తే కుదుట పడతాడని భావించారు. పట్టుమని 16 ఏళ్లకే ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. అయితే భార్యతో కూడా అతడు సరిగా ఉండలేకపోయాడు. గొడవల కారణంగా ఆమెకు దూరం అయ్యాడు. ఇక, అప్పటినుంచి ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉన్న కారణంగా అతడిలో ఆడవారిపై పగ మరింత పెరిగింది.
రేప్ అండ్ మర్డర్..
ఆడవారిపై పెరిగిన పగతో అమరేంద్ర రావత్ సైకోగా మారిపోయాడు. ఆ సైకో తత్వం క్రమంగా అతడిని హత్యచేసేలా క్రూరత్వానికి కారణమైంది. మొదటిసారి డిసెంబర్ 6న ఖుషేటి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిని రేప్ చేసి చంపేశాడు. తర్వాత డిసెంబర్ 17న ఇబ్రహింబాద్‌కు చెందిన మహిళను చంపేశాడు. ఆ వెంటనే డిసెంబర్ 29న 55 ఏళ్ల ఓ మహిళను చంపేశాడు. ఈ క్రమంలో నాలుగో మహిళను చంపటానికి తీసుకెళుతూ గ్రామస్తులకు చిక్కాడు. అతడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. పోలీసుల విచారణలో అతడు చేసిన నేరాలు ఒప్పుకున్నాడు.

ఒంటరిగా కంటపడితే అంతే..
పోలీసుల విచారణలో అమరేంద్ర రావత్ విస్తుపోయే విషయాలు వెల్లడించారు. తనకు ఒంటరిగా మహిళల్ని చూడగానే తనకు దెయ్యం పడుతుందని చెప్పాడు. ఆ దెయ్యం పోవాలని 8 సార్లు తాను తాయత్తు కట్టించుకున్నానని పేర్కొన్నాడు. అయినా ఫలితం లేకపోయిందని తెలిపాడు. తాను దెయ్యం కారణంగానే ఈ హత్యలు చేశానని వెల్లడించాడు. తాను ఎవరినీ కావాలని చంపదేలని చెప్పాడు. పోలీసులు, మానసిక నిపుణులు మాత్రం అమరేంద్ర రావత్ చిన్నతనం నుంచి ఎదుర్కొన్న వివక్ష, పిన తల్లులు అతడితో ప్రవర్తించిన తీరు మహిళలపై ద్వేషభావం పెంచిందని అంటున్నారు. అందుకే భార్యతో కూడా ఉండలేకపోయాడని, ఇప్పుడు వయసు 20 ఏళ్లు వచ్చాక అతడిలో కోరికలు పెరిగి, అత్యాచారాలు, హత్యలు చేస్తున్నాడని పేర్కొంటున్నారు.
