Varun Tej Marriage: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతూ తమ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేస్తున్నారు..పెళ్లి పేరు ఎత్తితేనే పారిపొయ్యేటట్టు ఉండే శర్వానంద్ కూడా ఈమధ్య నిశ్చితార్థం చేసుకున్నాడు..ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని నాగ బాబు ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అధికారికంగా తెలిపాడు..పెళ్లి ఎప్పుడు..? పెళ్లి కూతురు ఎవరు అనేది స్వయంగా వరుణ్ బాబు తెలుపుతాడు..అప్పటి వరకు వేచి ఉండండి అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

అంతే కాదు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా ఈ మధ్యనే ఒక ఇల్లు కొన్నాడని..పెళ్లి తర్వాత వాడు తన భార్య తో అక్కడే ఉంటాడని నాగబాబు చెప్పుకొచ్చాడు..కూతురు నిహారిక పెళ్లిని నాగబాబు ఎంత వైభవంగా జరిపించాడో అందరికీ తెలిసిందే..అప్పటి నుండి వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడూ అంటూ నాగబాబు ని ఏ ఇంటర్వ్యూ కి వెళ్లినా అడుగుతూ ఉండేవాళ్ళు.
ఇప్పుడు పెళ్లి కుదిరిందని స్వయంగా నాగ బాబు తెలిపేలోపు పెళ్లి కూతురు ఎవరూ అనే దానిపై ఇప్పటి నుండే మెగా అభిమానులు ఆరాలు తియ్యడం ప్రారంభించారు..అయితే వరుణ్ తేజ్ చాలా కాలం నుండి ప్రముఖ టాప్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి..లావణ్య త్రిపాఠి కూడా మెగా ఫ్యామిలీ లో జరిగే ప్రైవేట్ ఫంక్షన్స్ కి మెగా కుటుంబసభ్యులతో పాటుగా హాజరయ్యేది..కాబట్టి ఆమెనే పెళ్లి కూతురు అని అందరూ అనుకుంటున్నారు.

పైగా ఈ రూమర్స్ పై లావణ్య త్రిపాఠి కానీ , వరుణ్ తేజ్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..దీనితో వీళ్లిద్దరి మధ్య ఎదో ఉందని అభిమానులు ఫిక్స్ అయ్యారు..నిన్న జరిగిన ఇంటర్వ్యూ లో కూడా నాగ బాబు ని ‘వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడా’ అని అడగగా, అదే వాడే మీకు స్వయంగా తెలుపుతాడు త్వరలో అని అన్నాడు..దీనితో మెగా అభిమానుల్లో పెళ్లి కూతురు పై ఉత్కంఠ నెలకొంది.
