Unstoppable With Nbk- Prabhas: ప్రభాస్ చాలా అరుదుగా బయట కనిపిస్తారు. బేసిక్ గా ఇంట్రావర్ట్ అయిన ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ కి మాత్రమే ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఆయన ఎలాంటి టాక్ షోస్ కి హాజరయ్యేందుకు ఇష్టపడరు. అయితే ఆహా టీమ్ ఆయన్ని ఒప్పించారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ సందడి చేశారు. హీరో గోపీచంద్ తో కలిసి ప్రభాస్ ఈ షోకి రావడం జరిగింది. విడుదలైన ప్రోమోలు దుమ్మురేపుతున్నాయి. జస్ట్ ప్రోమో రికార్డు వ్యూస్ అందుకుంది. ఇక ప్రభాస్ లోని రొమాంటిక్ యాంగిల్, ఎఫైర్స్ గురించి చర్చ జరిగిందని అర్థం అవుతుంది.

ఎప్పటి నుండో ఫ్యాన్స్ ని వేధిస్తున్న పెళ్లి విషయం కూడా చర్చకు వచ్చింది. అందరు హీరోలు ప్రభాస్ పెళ్లి తర్వాతే మాది అంటున్నారని బాలయ్య అడగ్గా… నేను సల్మాన్ పెళ్లి తర్వాత అని చెప్తాను అంటూ టైమింగ్ పంచ్ విసిరాడు. మొత్తంగా ప్రభాస్ ఎఫైర్ రూమర్స్, పెళ్లి డిలేపై ఆసక్తికర డిబేట్ ఈ షోలో నడవనుంది. బాలయ్య ఊరుకోడు కాబట్టి అన్నీ బయటకు లాగేందుకు ట్రై చేస్తారు. ఆహాలో ఈ షో ఎప్పుడు ప్రసారం కానుందనే ఆత్రుత అందరిలో ఉంది. టీమ్ అధికారిక డేట్ విడుదల చేశారు.
డిసెంబర్ 30న ఈ మెగా ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఆహాలో ఆ రోజు నుండి స్ట్రీమ్ కానుంది. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహాకు చాలా మేలు జరగనుంది అనేది అనివార్యం. సదరు ఎపిసోడ్ భారీగా ఆదరణ దక్కించుకోవడం ఖాయం. అన్ స్టాపబుల్ షోలో ఇప్పటి వరకు ఏ ఎపిసోడ్ కి రాని వ్యూవర్ షిప్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ మంత్ ఎండ్ వరకు వేచి చూడాల్సిందే.

మరోవైపు ప్రభాస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలను ఆయన పూర్తి చేస్తున్నారు. అలాగే దర్శకుడు మారుతితో సైన్ చేసిన ప్రాజెక్ట్ సైతం షూటింగ్ జరుపుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ లో మారుతి ప్రాజెక్ట్ పై అసంతృప్తి ఉంది. ఓ డిఫరెంట్ రోల్ ప్రభాస్ ట్రై చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్ ఆలస్యం కానుంది. దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్ విమర్శల పాలైన తరుణంలో మెరుగైన అవుట్ ఫుట్ కోసం రిపేర్స్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Digital records deserves a Digital CutOut! Here is one for you Darlings❤️ Episode premieres December 30.#PrabhasOnAha#NandamuriBalakrishna #Prabhas pic.twitter.com/RvTh5RL5xW
— ahavideoin (@ahavideoIN) December 19, 2022