Seema Dasara Chinnodu: సినిమా పాటల కంటే ఈ మధ్య ఫోక్ సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరుగున పడిన కొందరు గాయకులు జానపద గీతాలు పాడి వెలుగులోకి వస్తున్నారు. అయితే ఇలాంటి పాటలు పాడిన వారంతా మారుమూల గ్రామానికి చెందిన వారు కావడమే విశేషం. ఒకప్పుడు వరిపొలంలో.. ఇతర చోట్ల పాడుకునే వారు ఇప్పుడు కొందరు వారి చేత పాటలు పాడిస్తూ వారికి హోదా ఇస్తున్నారు. మోహనభోగరాజు..మంగ్లీలే కాదు మేం కూడా పాడగలమని కొందరు మహిళలు తమ గొంతుతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పిల్లల నుంచి ముసలోళ్లతో సైతం డ్యాన్స్ చేయిస్తున్న ‘సీమ దసరా చిన్నోడు’ సాంగ్ ను ఉషక్క అనే గాయని పాడింది. అయుతే ఈ సాంగ్ వివరాల్లోకి వెలితే.
యూట్యూబ్ లో వీ1 క్రియేషన్స్ అనే ఛానెల్లో ఉన్న ‘సీమ దసరా చిన్నోడు’ అనే సాంగ్ పాపులర్ అయింది. జోక్ ఏంటంటే అసలు పాటు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ లిరిక్స్ పై ఎక్కువగా రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. దీంతో మెయిన్ వీడియో మరుగునపడుతుంది. అయితే ఆ లిరిక్ అంతగా పాపులర్ తీసుకురావడానికి ఉషక్క అనే గొంతు మాయ చేసిందని కొందరు అంటున్నారు. ఎంతో కాలంగా తాను సాంగ్స్ పాడుతున్నానని ఒక్క చాన్స్ కోసం తిరగని చోటు లేదని అంటోంది.కానీ ఈ సాంగ్ తో ఆమె పాపులర్ అయింది.
ఇక ఈ సాంగ్ కు పిల్లలు, ముసలోళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్టెప్పులు వేయిస్తున్నారు. ఓ కొరియన్ సాంగ్ లో ఉన్న స్టెప్పును ‘సీమ దసరా చిన్నోడు’ అనే సాంగ్ లో వేశారు. ఈ స్టెప్ కూడా పాపులర్ అయింది. కొందరు సెలబ్రెటీలు సైతం ఈ స్టెప్పులువేస్తూ ఆకట్టుకుంటున్నారు. కొందరు రింగ్ టోన్ పెట్టుకొని సందడి చేస్తుండగా.. చాలా మంది ఈ సాంగ్ రిపీట్ చేసుకుంటూ వింటున్నారు. మెయిన్ వీడియోను ఇప్పటి వరకు కోటిన్నర మంది వీక్షకులు చూడగా.. రీల్స్ అంతకంటే ఎక్కువగా వీక్షించడం విశేషం.
మొన్నటి వరకు బుల్లెట్టు బండి.. చేసిన హవా తరువాత అంతటి ఊపు ఈ సాంగ్ తోనే వచ్చిందని తెలుస్తోంది. ఇక ఇన్ స్ట్రాగ్రామ్ లో దాదాపు ఇదే సాంగ్స్ తో రీల్స్ చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. గూగుల్ లో ఈ పాట కోసం సెర్చ్ చేస్తే మెయిన్ వీడియో కంటే రీల్సీ వీడియోలే ఎక్కువగా పాపులర్ అయినట్లు తెలుస్తోంది. ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
