OMG 2 Vs Gadar 2: రెండు క్రేజీ సీక్వెల్స్ ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఒకటి ఓహ్ మై గాడ్ 2 కాగా మరొకటి గదర్ 2. ఈ చిత్ర ఫస్ట్ పార్ట్స్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. దీంతో జనాల్లో హైప్ ఏర్పడింది. ఆగస్టు 11న విడుదలవుతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అక్షయ్ కుమార్, సన్నీ డియోల్ లలో ఎవరి పైచేయి అయ్యిందో చూద్దాం. 2001లో వచ్చిన గదర్ బాలీవుడ్ అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే… రూ. 133 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా దెబ్బకు ఇండియా షేక్ అయ్యింది.
సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. దేశభక్తి, ప్రేమకథ కలగలిపి దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించారు. ఘన విజయం సాధించిన గదర్ చిత్రానికి దాదాపు 22 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుంది. దాదాపు టీమ్ కూడా సేమ్. సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా దర్శకుడు అనిల్ శర్మ గదర్ 2 తెరకెక్కించారు. ఈ మూవీపై హైప్ ఏ స్థాయిలో ఉందో బుకింగ్స్ తెలియజేస్తున్నాయి.
అలాగే 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది. అక్షయ్ భగవంతుడు రోల్ చేశారు. ఈ మూవీలో తెలుగులో గోపాలా గోపాలాగా రీమేక్ అయ్యింది. భక్తి, మూఢనమ్మకాల మీద సెటైరికల్ డ్రామా. ఓ మై గాడ్ సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి 11 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించారు. ఓ మై గాడ్ 2 విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ పార్ట్ కి ఉమేష్ శుక్లా దర్శకుడు. సీక్వెల్ అమిత్ రాయ్ తెరకెక్కించారు.
పరేష్ రావల్ కి బదులు పంకజ్ త్రిపాఠిని తీసుకున్నారు. ఇక గదర్ 2, ఓ మై గాడ్ 2 బుకింగ్స్ పరిశీలిస్తే గదర్ 2 దే పైచేయి అయ్యింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం గదర్ 2 చిత్రానికి 56000 టికెట్స్ అమ్ముడుపోయాయి. రూ. 1.47 కోట్ల వసూళ్లు దక్కాయి. అదే సమయంలో ఓ మై గాడ్ 2 చిత్రానికి 7300 టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. రూ. 25 లక్షల వసూళ్లు దక్కాయి. ప్రస్తుతానికి ఓ మై గాడ్ పై గదర్ ఆధిపత్యం కలిగి ఉంది.