Naga Chaitanya : చై-చందూ-బన్నీ

2018లో గుజరాత్ విరావల్ నుంచి 21 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారు పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ జాలర్లను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ బంధించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది.

Written By: NARESH, Updated On : August 4, 2023 2:34 pm
Follow us on

-చైతన్యకు విజయాలనిచ్చిన ఇద్దరితో ఒకేసారి టై అప్
-సెంటిమెంట్ వర్కౌట్ పై అక్కినేని వారసుడి హోప్

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తున్నది. 2009 లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని నట వారసుడికి చెప్పుకోదగ్గ హిట్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తాతలు తెలుగు సినిమా దిగ్గజాలు. ఒకరు టాప్ హీరో ఏఎన్నార్ కాగా, మరొకరు టాప్ ప్రొడ్యూసర్ రామానాయుడు. ఇక తండ్రి నాగార్జున తన తరంలో టాప్ హీరో. మేనమామల్లో ఒకరు టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కాగా, మరొకరు టాప్ హీరో వెంకటేష్. ఇంత సపోర్ట్ ఉన్నా పెద్దగా సక్సెస్ అవలేదు. వచ్చిన హిట్లు కూడా అంతంత మాత్రమే.

ప్రస్తుతం నాగ చైతన్య తన తదపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్‎లో చై పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేస్తున్నాడు.గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నది. మత్స్యకారుల జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్‎పైకి రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.

2018లో గుజరాత్ విరావల్ నుంచి 21 మంది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారు పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ జాలర్లను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ బంధించారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ జాలర్ల కథ ఆధారంగానే చై, చందూ కాంబోలో రాబోతున్న సినిమా. ఈ పాన్ ఇండియన్ మూవీలో పాక్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కిన మత్స్యలేశం గ్రామానికి చెందిన జాలరైన గణగల్ల రామారావు పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.

– ఒకేసారి ఇద్దరితో టై అప్

నాగ చైతన్యకు ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒకేసారి రెండు సెంటిమెంట్లు ఈ సినిమాతో టచ్ చేస్తున్నాడు. ఒకటి తనకు మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన బ్యానర్ గీతా ఆర్ట్స్. ఈ బ్యానర్ లో వచ్చిన 100 % లవ్ సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఎన్నో ప్లాఫ్ ల తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో మలయాళ రీమేక్ ప్రేమమ్ సినిమా నాగ చైతన్యకు మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఒకేసారి రెండు సెంటిమెంట్లు కలిసి వస్తుండడంతో తన ఖాతాలో మరో భారీ హిట్ పడుతుందని చై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

– అజయ్ యాదవ్