Homeఎంటర్టైన్మెంట్Samarasimha Reddy: ‘సమరసింహారెడ్డి’లో రైల్వేట్రాక్ సీన్ తో ఏడిపించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో చూడండి..

Samarasimha Reddy: ‘సమరసింహారెడ్డి’లో రైల్వేట్రాక్ సీన్ తో ఏడిపించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో చూడండి..

Samarasimha Reddy
Samarasimha Reddy

Samarasimha Reddy: యాక్షన్, సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ సమరసింహారెడ్డి. అప్పటి వరకు వరుస ప్లాపులతో ఉన్న బాలకృష్ణకు ఈ సినిమా మరోసారి కెరీర్ ను మలుపు తిప్పింది. అంతేకాకుండా సమరసింహారెడ్డితోనే రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత వచ్చిన ఎన్నో ఫ్యాక్షనిజం సినిమాలు బంపర్ హిట్టు కొట్టాయి. అయితే మిగతా హీరోల కంటే బాలయ్య కే ఇలాంటి సినిమాలు షూట్ అవుతాయని ఇండస్ట్రీలో చర్చించుకుంటారు. అందుకే ఫ్యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి సినిమాలు కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచాయి. అయితే తన లైఫ్ లో సమరసింహారెడ్డి మైలురాయిగా నిలిచిందని బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పేవారు.

ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మొత్తం సెంటిమెంట్ తో సాగుతుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లను కాపాడే అన్నగా కనిపిస్తాడు. వారి కోసం తెగ కష్టపడిపోతుంటారు. ముగ్గురు అక్కాచెళ్లెళ్లలో సరస్వతి అనే అమ్మాయి దివ్యాంగురాలు. ఓసారి ఆమె రైల్వే ట్రాక్ లో చిక్కుకోవడంతో ఎమోషనల్ గా రన్నింగ్ చేయడంతో తిరిగి కాళ్లు వస్తాయి. ఈ సీన్ సినిమాలకే హైలెట్ గా నిలిచింది. ఈ పాత్రలో నటించిన అమ్మాయి పేరే సహస్ర. అయితే సహస్ర ఇప్పుడు గుర్తుపట్టకుండా మారిపోయింది.

భానుచందర్ హీరోగా నటించిన ఉద్యమం సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తరువాత రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, మేజర్ చంద్రకాంత్ లతో పాటు వందల కొద్ది సినిమాల్లో నటించారు. ఆమె నటించిన చివరి సినిమా సమరసింహారెడ్డి కావడం విశేషం. ఈ సమయంలో ఆమె సినిమాల్లో నటిస్తే చదువు పాడవుతుందన్న ఉద్దేశంతో సినిమాల నుంచి తప్పుకున్నారు. కానీ మళ్లీ సినిమాల్లోకి రాలేదు. అయితే చిన్న వయసులోనే ఎన్నో సినిమాల్లో నటించిన సహస్ర ఇటీవల ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పేవారు.

Samarasimha Reddy
Sahasra

తను సినిమాల్లో నటించేటప్పుడు తరుచూ మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లేదట. అక్కడ రాం చరణ్ తో కలిసి టెడ్డీ బేర్ తో ఆడుకునేదట. అలాగే అప్పుడప్పుడు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్లేదట. మంచు మనోజ్ తో కలిసి సినిమా సెట్స్ కె వెల్లేవారట. అలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ మొత్తం తిరిగిన ఆమె ఇప్పుడు కొంచెం బొద్దుగా తయారయ్యారు. సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తాను. కానీ సినిమాల కోసం ఎక్కువగా ప్రయత్నించను.. అని సహస్ర చెబుతున్నారు. మరి ఆ సహస్ర ఇప్పుుడెలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper