
Alia Bhatt: బాలీవుడ్ మీడియాపై ప్రముఖులు మండిపడుతున్నారు. తాజా సంఘటనతో సెలెబ్రిటీలు విస్తుపోయారు. ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ ని నిరంతరం కెమెరాలతో వాచ్ చేస్తున్నట్లు వెలుగులోకి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇది తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అంటూ మండిపడ్డారు. అలియా మాట్లాడుతూ… మధ్యాహ్నం వేళ ఇంట్లో నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను. మా పక్క బిల్డింగ్ టెర్రస్ పై నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనుమానం కలిగింది. నిశితంగా పరిశీలిస్తే ఇద్దరు వ్యక్తులు కెమెరాలు పట్టుకొని నన్ను చిత్రీకరిస్తున్నారని అలియా వెల్లడించారు.
ఏకంగా ఇంట్లోకి కెమెరాలు పెట్టి షూట్ చేయడం వివాదానికి దారితీసింది. దీంతో సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముంబై పోలీసులు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా అలియాను కోరినట్లు సమాచారం. మరి ఆమె కేసు పెట్టారా లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇది ప్రైవసీ మేటర్ కావడంతో పాటు భద్రతకు ముప్పు తెచ్చే పరిణామం. అందుకే పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.
సెలబ్రిటీల తెర వెనుక జీవితాలు తెలుసుకోవాలని, వాటిని బ్రేక్ చేసి క్యాష్ చేసుకోవాలనే తపనలో కొన్ని సంస్థలు శ్రుతి మించుతున్నాయి. హద్దులు దాటి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. కాగా అలియా భట్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 14న ప్రియుడు రన్బీర్ కపూర్ తో ఏడడుగులు వేశారు. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అదే ఏడాది నవంబర్లో కూతురు జన్మించింది. ఈ క్రమంలో అలియా పెళ్ళికి ముందే తల్లి అయ్యారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అందులో తప్పేముందని అలియా సమర్ధించుకోవడం విశేషం.

కూతురు పేరు రాధ. ఇక 2022లో అలియా ఏకంగా మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించారు. గంగూబాయి కతియావాడి, ఆర్ ఆర్ ఆర్, బ్రహ్మాస్త్ర పలు భాషల్లో విడుదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో అలియా చరణ్ ప్రేయసి సీత పాత్ర చేశారు. అయితే ఆమె పాత్రకు అంతగా నిడివి లేదు. ప్రస్తుతం అలియా రణ్వీర్ సింగ్ తో రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రం చేస్తున్నారు. అలాగే హార్ట్ ఆఫ్ స్టోన్ టైటిల్ తో హాలీవుడ్ మూవీ చేస్తున్నారు. పెళ్ళైనా ఆమె జోరు తగ్గలేదు.