
Deepika Pilli: పరిశ్రమకు వచ్చి మూడేళ్లు కావడం లేదు అప్పుడే తెగిస్తుంది తెలుగు యాంకర్ దీపికా పిల్లి. ఫోటో షూట్స్ పేరుతో విచ్చలవిడిగా చూపించే ప్రోగ్రాం పెట్టుకుంది. గ్లామర్ తోనే ఫేమస్ కావాలనుకుంటుంది. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో భూకంపం సృష్టించింది. బీచ్లో హాట్ థైస్ హైలెట్ అయ్యేలా సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది. నాకు ఆ సాగరతీర అందమైన అనుభవం మళ్ళీ కావాలంటూ కామెంట్ పోస్ట్ చేసింది.
దీపికా పిల్లి ఫోటోలు చూసి కుర్రాళ్ళకు చెక్కరొచ్చింది. ఇక సోయ లేకుండా ఇష్టమొచ్చిన కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. బీచ్లో అంటే ఆ మాత్రం తెగించాలి అంటున్నారు. ఈ మధ్య ప్రతి యాంకర్ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో హద్దులు లేని అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఫాలోవర్స్ ని పెంచుకోవడం ద్వారా తమ ఆదాయం, ఫేమ్ పెంచుకోవాలనుకుంటున్నారు.

ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ సంఖ్యను బట్టి సంస్థలు వారి బ్రాండ్ వాల్యూ నిర్ణయిస్తున్నారు. దాంతో వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. రష్మీ, శ్రీముఖి, వర్షిణి, అనసూయ… ఇలా ఒకరేంటి పలువురు యాంకర్స్, హీరోయిన్స్ సోషల్ మీడియాలో లక్షలు సంపాదిస్తున్నారు. వారి ప్రొఫెషన్ కి అదనంగా ఈ రూపంలో సంపాదన సమకూరుతుంది.

ఇక దీపికా పిల్లి కెరీర్ పరిశీలిస్తే… ఒకప్పటి టిక్ స్టార్ యాంకర్ అయ్యారు. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన దీపికా ఢీ డాన్స్ రియాలిటీ షోతో యాంకర్ అవతారం ఎత్తారు. సీజన్ 13లో రష్మీతో పాటు యాంకరింగ్ బాధ్యతలు నెరవేర్చారు. పెద్దగా అనుభవం లేకున్నా తన గ్లామర్ తో ఆకట్టుకున్నారు. బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించారు. అయితే ఆమెకు సీజన్ 14లో ఛాన్స్ దక్కలేదు.
అప్పుడే దీపికాకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ రావడం విశేషం. గత ఏడాది వాంటెడ్ పండుగాడ్ టైటిల్ తో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో దీపికా పిల్లి ఒక రోల్ చేశారు. ఈ చిత్రంలో సునీల్ , అనసూయ, విష్ణుప్రియ, వెన్నెల కిషోర్ తో పాటు పలువురు నటించారు.ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోలో దీపికా యాంకర్ గా ఉన్నారు. సుడిగాలి సుధీర్ మరో యాంకర్ కాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా ఉన్నారు.