
S. S. Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి #RRR సినిమా తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులారిటీ మరియు క్రేజ్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.ఆయన ప్రతిభ ని అవతార్ సిరీస్ మరియు టైటానిక్ వంటి వెండితెర దృశ్య కావ్యాలను తీసిన జేమ్స్ కెమరూన్ వంటి దిగ్గజాలు మెచ్చుకోవడం తో పాటుగా, పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ ని కూడా డాకించుకుంది.రీసెంట్ గా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్స్’ క్యాటగిరీ లో ఒస్కార్స్ కి కూడా నామినేట్ అయ్యింది.
ఇక అతి త్వరలోనే ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ అమెరికా లో 200 థియేటర్స్ లో విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ ప్రేక్షకులు ఎగబడి చూసారు, థియేట్రికల్ వెర్షన్ కూడా అదే రేంజ్ లో క్లిక్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇది ఇలా ఉండగా #RRR సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన తర్వాత డైరెక్టర్ రాజమౌళి కి అక్కడి మీడియా ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది.
రీసెంట్ గానే ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజమౌళి మన ఇండియన్ సినిమా గొప్పతనం గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.’మా అమెరికన్స్ కచ్చితంగా చూడాల్సిన 5 ఇండియన్ సినిమాలు ఏమిటో చెప్తారా’ అని రాజమౌళిని విలేఖరి అడగగా అప్పుడు రాజమౌలి 3 హిందీ సినిమాలు , ఒక తెలుగు సినిమా మరియు ఒక తమిళ సినిమా పేర్లు చెప్తాడు.ఆయన మాట్లాడుతూ ‘1980 వ సంవత్సరం లో కె.విశ్వనాధ్ తెరకెక్కించిన శంకరాభరణం అనే మా తెలుగు చాలా గొప్పది, ప్రతీ ఒక్కరు ఈ సినిమాని తప్పక చూడాల్సిందే.

అంత అద్భుతంగా తెరకెక్కించారు,ఇక హిందీ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన మున్నా భాయ్ MBBS ,బండిట్ క్వీన్ మరియు బ్లాక్ ఫ్రైడే సినిమాలను చూడమని రికమెండ్ చేస్తాను.వీటితో పాటు తమిళం లో వెట్రిమారన్ దర్శకత్వం లో వచ్చిన ‘ఆడుకలం’ అనే సినిమాని కూడా చూడమని చెప్తున్నాను’ అంటూ రాజమౌళి ఈ సందర్భంగా మాట్లాడాడు.ఇక చివరగా తన ఈగ సినిమా కూడా చూడాల్సిందిగా రికమెండ్ చేసాడు.
