Worms: మన శరీరం కణజాలాల నిర్మితం. ఏదైనా ప్రమాదంలో గాయం ఏర్పడినప్పుడు.. అక్కడ కణజాలం దెబ్బతింటుంది. తర్వాత దాని స్థానంలో కొత్త కణజాలం ఏర్పడుతుంది.. ఇదంతా కూడా సరైన చికిత్స చేసినప్పుడే.. ఒక్కోసారి గాయాలకు సరైన చికిత్స చేయకుంటే అక్కడ పురుగులు పడతాయి. సాధారణంగా పురుగులు మృత కణాలనే ఆహారంగా తీసుకుంటాయి. కానీ అవే పురుగులు గాయాలను కూడా మాన్పడంలో తోడ్పడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
Worms
యాంటీబయాటిక్స్ కు లొంగకుండా, సరైన విధంగా మందులు వాడకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు వంటి వాటి వల్ల గాయాలు అసలు మానవు.. గాయాల్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది.. అవి మరింత తీవ్రమై పుండ్లు గా మారడం, చీము రావడం, కణాలు చనిపోయి కుళ్ళిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరోవైపు పలు రకాల బ్యాక్టీరియాలు ఔషధాలకు నిరోధకత పెంచుకోవడంతో చికిత్స చేసినా ఫలితం ఉండదు. దీనివల్ల పుండు మానడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించి ప్రాణాలు పోయేందుకు కారణమవుతుంది.. ఇలాంటి సమయంలో పురుగులతో చికిత్స వల్ల ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్తించిన ఈ విధానాన్ని… ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధంలోనే..
మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది సైనికులు మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. వీరిలో చాలామందికి ఇన్ఫెక్షన్లు సోకాయి. ఫలితంగా వారి శరీర భాగాలను తొలగించాల్సి వచ్చింది.. అయితే ఫ్రెంచ్ సైనికులు గాయాలపై పురుగులు ఏర్పడ్డాయి. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ గాయాలు మానడం కనిపించింది. అయితే పురుగులు విడుదల చేసిన రసాయనాల వల్ల గాయం పై ఉన్న బ్యాక్టీరియా చనిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో ఈ విధానాన్ని సైనికుల గాయాలపై ప్రయోగించి వాటిని తగ్గించారు. కాల క్రమేణా యాంటీబయాటిక్స్ ను కనిపెట్టడంతో ఈ విధానం మరుగున పడిపోయింది. గాయాలకు, పుండ్ల చికిత్సలో పురుగుల వినియోగానికి 2004లో ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఆమోదం తెలిపింది. 2009 నుంచి 2019 మధ్యకాలంలో ఈ తరహా చికిత్సలు పెరిగాయి. వాస్తవానికి ఇప్పుడు నేరుగా మన మృత కణాలను తినవు. ముందుగా వాటి నోటు నుంచి వివిధ ఎం జైమ్ లో ఉండే లాలాజలాన్ని లేదా సలైవా విడుదల చేస్తాయి. ఇవి మృత కణాలను కరిగించి పోషక ద్రవంగా మారుస్తాయి. ఇదే సమయంలో అక్కడ ఉండే బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. అవి కూడా పోషక ద్రవంగా మారుతాయి.. ఈ పురుగులు ఆ పోషక ద్రవాన్ని పీల్చుకొని జీవిస్తాయి. మొత్తంగా గాయం పై మృత కణాలు, ఇతర సూక్ష్మజీవులు నశించడంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.. పురుగులు విడుదల చేస్తున్న సలయివా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చురుగ్గా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇందువల్లే ఈ విధానానికి
ఇంగ్లాండ్ లోని సౌత్ వేల్స్ కు చెందిన బయోమెండే సంస్థ గ్రీన్ బాటిల్ బ్లో ప్లై రకానికి చెందిన ఈగల లార్వాలను టీ బ్యాగుల తరహాలో ప్యాక్ చేసి అమ్ముతోంది. ఏట తొమ్మిది వేల బయో బ్యాగులను చికిత్సల కోసం కొంటున్నారని చెబుతోంది. ఇక ఈ పురుగుల చికిత్సకు సంబంధించి… సాధారణంగా పురుగులను చూస్తే చాలామంది ఒళ్ళు జలదరిస్తుంది. ప్రస్తుతం గాయాలకు పురుగుల చికిత్సలను ఇదో సమస్యగా మారిందని ఇంగ్లాండ్ వైద్యులు చెబుతున్నారు.
Worms
చాలామంది నర్సులు పురుగులను చూసి అసహ్యం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అందువల్ల కొందరి నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ చికిత్సలో వినియోగిస్తున్నామని అంటున్నారు. ఎలాగూ పురుగులు వేస్తున్నారని ఏదో ఒక పురుగు వేసుకుంటే డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. సాధారణంగా పురుగులు అంటేనే వివిధ రకాల బ్యాక్టీరియాలు, వైరస్ లు, సూక్ష్మజీవులకు అడ్డాలు అని, వాటితో మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయని చెబుతున్నారు. ఏవైనా ప్రత్యేకమైన ఈగ జాతులకు చెందిన గుడ్లను యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణంతో శుద్ధిచేసి, ప్రయోగశాలలో వాటిని పొదిగి లార్వాదశకు వచ్చాక గాయాలపై వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు.. ఇక ఈ పూలను కూడా నేరుగా గాయాలపై వేయకుండా టీ బ్యాగు తరహా ప్రత్యేకమైన పలుచని రంధ్రాలు ఉన్న బయో బ్యాగ్లో ఉంచి వాడుతారు. ఈ బ్యాగులను గాయాన్ని తాకేలా పెట్టి పైన వదులుగా పట్టి కడతారు. ఇలా రెండు నుంచి నాలుగు రోజులు ఉంచుతారు. దీనివల్ల పురుగులు విడుదల చేసిన రసాయన ద్రావణం గాయం లోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఫలితంగా గాయం తగ్గుముఖం పడుతుంది. దీనినే వైద్య పరిభాషలో ముల్లును ముల్లుతో తీయడం అంటారు.