Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజే వేరు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు అదిరిపోయే డైలాగ్స్ ఉంటాయి. కొన్ని డైలాగ్స్ చిరంజీవికి మాత్రమే షూటవుతాయి. ఆయన కొట్టే డైలాగ్ ఇప్పటికీ పేలుతుంటాయి. ఇంద్ర సినిమాలోని ‘మొక్కే కదా అని పీకేస్తే’.. డైలాగ్ ఇప్పటికీ సెన్సేషనే. ఇటీవల చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్స్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా ట్రైలర్ సందర్భంగా ‘నేను రాజకీయాలకు దూరమయ్యాను.. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు..’ అనే డైలాగ్ కొన్ని రోజుల పాటు సంచలనం సృష్టించింది. చివరికీ చిరు స్పందించేదాకా ఈ డైలాగ్ పై రకరకాల పోస్టులు, కామెంట్లు పెట్టారు. ఈ సినిమాలో చిరు చేసిన ఓ డైలాగ్ ఇప్పుడు పవన్ కల్యాన్ ఫాలో అయ్యాడని అంటున్నారు. అ వివరాలేంటో చూద్దాం.

గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామాన్ని పవన్ శనివారం సందర్శించారు. ఇక్కడ కొందరి పేదల ఇళ్లు కూల్చివేయడంతో వారిని పరామర్శించేందుకు పవన్ ఈ గ్రామానికి వెళ్లారు. అయితే పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడకు రావడానికి అనుమతి లేదంటూ రోప్ టీం తెలిపింది. దీంతో పవన్ కారు నుంచి దిగి నడుచుకుంటూ వెళ్లారు. ఇలా మూడు కిలోమీటర్ల వరకు నడిచారు. దీంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలతో ఈ గ్రామానికి వెళ్లే రోడ్డు రద్దీగా మారింది. దీంతో పోలీసులు అనుమతి ఇవ్వడంతో కారుపై వెళ్లారు.
ఈ సందర్భంగా పవన్ ను ముందుగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. కొందరు ఈ వీడియోకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ డైలాగ్ జోడించారు. అంటే పవన్ నడుచుకుంటూ వస్తుండగా ‘ప్రొటోకాల్ నా కారుకే కానీ.. నా కాళ్లకు కాదు గా..’ అనే డైలాగ్ వస్తుంది. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట్లో రచ్చ రచ్చ అవుతోంది.

అటు మొత్తానికి పవన్ ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. అక్కడి బాధితులను అక్కున చేర్చుకొని వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఒక్కసారిగా రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల పక్షాన పోరాడుతానని వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా..? అని నిలదీశారు. బాధితులతో కనీసం మాట్లాడకుండా ఇళ్లుకూల్చడానికి మీరెవరు..? అంటూ ప్రశ్నించారు.
#JanaSenaWithIppatam #Pawankalyan #ippatamvillage pic.twitter.com/3PjidNmw51
— Durgasi Sekhar (@DurgasiSekhar) November 5, 2022