
Pacific Ocean: ప్రపంచంలోనే అతిపెద్దదైన పసిఫిక్ మహాసముద్రం లోపల రంధ్రం ఏర్పడింది. దీని పర్యవసానాల వల్ల ప్రపంచానికి ఉపద్రవం పొంచి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు పరిశీలించిన ఆధారాల ప్రకారం పసిఫిక్ పసిఫిక్ అడుగుభాగం నుంచి ఒక రంధ్రం ఏర్పడినట్టు, దాని ద్వారా ద్రవం లీక్ అవుతున్నట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీనివల్ల రిక్టర్ స్కేల్ పై 9 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ రంధ్రాన్ని పసిఫిక్ మహాసముద్రం దిగువన 19.65 కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్ లైన్ లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రంద్రం ద్వారా ఫైథియాస్ ఒయాసిస్ అనే ద్రవాన్ని సముద్రపు అడుగుభాగం నుంచి నాలుగు కిలోమీటర్ల దిగువకు విడుదల చేస్తోంది. ఈ ద్రవం టెక్టోనిక్ ప్లేట్ల మధ్య కందెన లాగా పని చేస్తున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. సముద్రపు అడుగుభాగం నుంచి 2.5 మైళ్ళ దిగువన నీటి నిక్షేపాలు సుడులు తిరుగుతున్నాయని, అవి పసిఫిక్ సముద్రం లో ఏర్పడిన రంధ్రాన్ని ప్రతిబింబిస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రం మైదాన ప్రాంతాల్లో ఒక్కోసారి లోతు పెరుగుతుంది. ఇవి సన్నని పొడవైన వాలు కలిగి ఉంటాయి. లోతు ఎక్కువగా ఉండటంతో అగాధాలుగా మారిపోతాయి. వీటి సరాసరి లోతు 5,500 మీటర్లుగా ఉంటుంది. ఇవి ఒక్కోసారి రంధ్రాలుగా ఏర్పడుతుంటాయి. ఫలితంగా భూకంపాలు ఏర్పడే పరిస్థితులకు దారితీస్తుంటాయి. భూపటలంపై రెండు, మూడు ప్లేట్లు ఖండించుకునే ప్రాంతాల్లో ఈ రంధ్రాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. భూమ్మీద ఉన్న మహా సముద్రాలలో పసిఫిక్ లోనే ఈ తరహా రంధ్రాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇక పసిఫిక్ మహాసముద్రం భౌగోళిక విస్తీర్ణంలో అగాథాలు 1.2% విస్తరించి ఉన్నాయి.
ఇలాంటి రంధ్రాలు ఏర్పడటానికి ప్రధాన కారణం సముద్రంలోని నీరు ఎల్లప్పుడూ కదులుతూ ఉండటమే. ఈ కదలిక మూడు రకాలుగా ఉంటుంది. తరంగాలు, ప్రవాహాలు, పోటు పాటులు. వీటి ఫలితంగా భూగోళంపై ఏర్పడే అత్యధిక, జల్ప ఉష్ణోగ్రతలు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ప్రకృతి సిద్ధంగా విస్తరిస్తాయి. ఇక సముద్రంలో తరంగాల పుట్టుక, పెరుగుదల, చించుకోవడం అనేది ప్రధానంగా సముద్రాలపై వీచే పవనాలపై ఆధారపడి ఉంటుంది. గాలి శక్తిని అనుసరించి సముద్ర ఉపరితల నీరు శృంగం రూపంలో పైకి, ద్రోణి రూపంలో కిందికి లేచిపడతాయి. వరుసగా ఉన్న రెండు శృంగాలు, ద్రోణులు మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు.

ఇక ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో రంధ్రం ఏర్పడిన నేపథ్యంలో అది భూకంపానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నుంచి పైథియాస్ ఓయాసిస్ అనే ద్రవం వెలువడుతోంది. ఇది సముద్రం నుంచి చమురు వెలికి తీస్తున్నప్పుడు ఇలాంటి ద్రవం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన రంద్రం ద్వారా అమెరికా సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్ పై 9 తీవ్రతతో భూకంపం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు..ఇక సాధారణంగా ఒక జీవి భూమిపై మరణిస్తే అది ఆక్సిజన్ వల్ల కూలిపోయి భూమిలో కలిసిపోతుంది. సముద్రంలో మాత్రం జలచరాలు మరణిస్తే అడుగు భాగానికి చేరుకుంటాయి. చనిపోయిన జీవుల కళేబరాలపై ఇసుక, మట్టి పేరుకుపోయి కొన్ని పొరలుగా ఏర్పడతాయి. సముద్రం అడుగు భాగంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి చనిపోయిన జంతువులు కూలిపోకుండా కెరోజిన్ అనే పదార్థంగా మారిపోతాయి. వీటిపై కొన్ని మిలియన్ల సంవత్సరాలపాటు ఇసుక, బురద క్రమంగా పేరుకుపోవడం వల్ల ఉష్ణోగ్రత, పీడనం పెరిగిపోయి కేరోజిన్ క్రూడ్ ఆయిల్, నాచురల్ గ్యాస్ గా మారుతుంది. ఒక జంతువు క్రూడ్ ఆయిల్ గా మారేందుకు 22 లక్షల సంవత్సరాలు పడుతుంది.