spot_img
Homeఅంతర్జాతీయంHormuz Strait Alternative Project Gulf Countries: హార్ముజ్‌కు ప్రత్యామ్నాయ ప్రాజెక్టు.. గల్ఫ్‌ దేశాల కొత్త...

Hormuz Strait Alternative Project Gulf Countries: హార్ముజ్‌కు ప్రత్యామ్నాయ ప్రాజెక్టు.. గల్ఫ్‌ దేశాల కొత్త ఫ్లాన్‌!

Hormuz Strait Alternative Project Gulf Countries: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ వార్‌.. గల్ఫ్‌ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇరాన్‌ గల్ప్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. మరోవైపు హార్మూజ్‌ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు బ్రేక్‌ పడింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌ మినహా మిగతా దేశాల నౌకలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇరాన్‌ అమర్చిన వాటర్‌ మైన్‌ల భయం వెంటాడుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌ నౌక పేలిపోయింది. ఈ నేపథ్యంలో హార్మూజ్‌ ఇరాన్‌ ఆధీనంలో ఉండడంతో పెట్రోలియం రవాణాకు అంతరాయం కలిగింది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

గల్ఫ్‌ దేశాలకు నష్టం..
హార్మూజ్‌ మూసివేతతో గల్ఫ్‌ దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించాయి. మూడు దేశాల్లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి. రవాణా ఆగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు ఇరాన్‌ గల్ఫ్‌ దేశాల ఆయిల్‌ రిఫైనరీలను టార్గెట్‌ చేస్తోంది. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాలు సరికొత్త ఆలోచన చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిపెట్టాయి.

ప్రత్యామ్నాయ ప్రతిపాదన..
పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో డైరెక్ట్‌గా లింక్‌ చేసే భారీ కాలువ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాయి. ఇది ప్రపంచ చమురు 20% ప్రవాహానికి హార్ముజ్‌ రిస్క్‌ను తొలగించి, భద్రమైన ఎగుమతి మార్గాన్ని అందిస్తుంది. ప్రస్తుతం చర్చా దశలోనే ఉంది, ఇది పూర్తయితే గ్లోబల్‌ ఇంధన లాజిస్టిక్స్‌ను మార్చివేస్తుంది.

మూడు కాలువలు..
సల్మాన్‌ కాలువ సౌదీలో 950 కిలోమీటర్ల పొడవు, రుబ్‌ అల్‌–ఖాలీ మధ్యస్థం. రెడ్‌ సీ లేదా గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌కు లింక్‌ అవుతుంది. ఇది విజన్‌ 2030లో భాగం. యూఏఈ – ఒమన్‌ కాలువ 48 కిలో మీటర్లు(30 మైళ్లు), దుబాయ్‌ సమీపం నుంచి ఫుజైరా వరకు. ఇరాన్‌ ప్రభావం లేకుండా ఉంటుంది. అరేబియన్‌ కాలువ 75 కిలో మీటర్ల పొడవు, 150 నుంచి 500 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిని యూఏఈ ప్రతిపాదించింది. హార్ముజ్‌ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. తాజా యుద్ధంతో 700లకుపైగా నౌకలు చిక్కుకున్నాయి. ప్రతాయమ్నాయ కాలువల నిర్మాణం జరిగితే సౌదీ, యూఏఈ, ఖతార్‌ ఎగుమతులు సురక్షితం. దీంతో హార్ముజ్‌ ప్రాధాన్యం తగ్గుతుంది.

జీసీసీ కూటమి చర్చలు జరుగుతున్నాయి. షార్ట్‌–టర్మ్‌ పైప్‌లైన్‌లు (ఈస్ట్‌–వెస్ట్‌) సహాయం. దీర్ఘకాలంలో ఇది మధ్యప్రాచ్య డైనమిక్స్‌ను మారుస్తుంది. భారత్‌ వంటి దేశాలకు ఎంతో మేలు జరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version