Kiran Abbavaram
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం అబ్బవరం కెరీర్ ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ యంగ్ హీరోతో స్టార్ డైరెక్టర్ మూవీ చేస్తున్నాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. క చిత్రంతో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. ఫాంటసీ అంశాలు జోడించి, సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన క కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 5-10 కోట్ల బడ్జెట్ తో క మూవీ చేశారట. క ఫుల్ రన్ ముగిసే నాటికి రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టింది. కాబట్టి క బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు. క చిత్రానికి గట్టి పోటీ ఎదురైంది. అమరన్, లక్కీ భాస్కర్ సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
క చిత్రానికి సరిపడా థియేటర్స్ దొరకలేదు. లేదంటే వసూళ్లు మరింత ఎక్కువ దక్కేవి. క మూవీ నచ్చకపోతే ఇకపై సినిమాలు చేయనంటూ సవాల్ విసిరిన కిరణ్ అబ్బవరం… ఒక విధంగా చెప్పి మరీ హిట్ కొట్టాడు. క మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన కిరణ్ అబ్బవరం తో చిత్రాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపుతున్నారని సమాచారం. విషయంలోకి వెళితే.. కొత్త బంగారు లోకం , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడని లేటెస్ట్ టాక్.
Also Read : కిరణ్ అబ్బవరం డేరింగ్ డెసిషన్.. ఇంత వరకు స్టార్స్ కూడా పట్టించుకోలేదు! సాధ్యమేనా?
శ్రీకాంత్ అడ్డాల ఒక దశలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు బ్రహ్మోత్సవం మూవీ ఫలితం ఆయన కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆయనకు అవకాశాలు రాలేదు. శ్రీకాంత్ అడ్డాల గత చిత్రం పెదకాపు సైతం నిరాశపరిచింది. అయినప్పటికీ శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయన మేటర్ ఉన్న దర్శకుడు. అందుకే కిరణ్ అబ్బవరం అవకాశం ఇచ్చాడని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా రేపు విడుదల అవుతుంది. దిల్ రూబా ట్రైలర్ మెప్పించిన నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రుక్షర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. ఇక దిల్ రుబా మూవీ కథ అందరికీ తెలిసిందే. కానీ ఒక కొత్త ట్రీట్మెంట్ ఇచ్చామని చెబుతున్నారు. దిల్ రుబా విజయం సాధిస్తే కిరణ్ అబ్బవరం ఇమేజ్ మరో రేంజ్ కి వెళుతుంది. దిల్ రుబా చిత్రాన్ని కిరణ్ అబ్బవరం వినూత్నంగా ప్రమోట్ చేశాడు. కథను అంచనా వేసిన వ్యక్తికి బైక్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దిల్ రుబా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది.
Also Read : హీరో కాకపొయ్యుంటే రాజకీయాల్లోకి వెళ్ళేవాడిని..ఆ పార్టీ లో చేరేవాడిని అంటూ కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్!