Cobra Video: నేటి కాలంలో యువత పట్టణాలు, నగరాలలో చదువుకుంటున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. సాధారణంగా పట్టణాలు, నగరాలు కాంక్రీట్ భవనాలతో కనిపిస్తాయి. పైగా వాహనాల రద్దీ వల్ల విపరీతమైన కాలుష్యం.. పని ఒత్తిడి.. కృత్రిమమైన వాతావరణం.. ఇవన్నీ కూడా తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతాయి. ఈ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలామంది విహారయాత్రలకు వెళుతుంటారు. లేదా దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలకు పయనమవుతుంటారు. అలా ఓ యువకులు సమీపంలో ఉన్న అడవికి వెళ్లారు. ఇందుకోసం వారు ఎప్పటినుంచో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. చివరికి తాము చూడాలి అనుకున్న అడవికి వెళ్లారు.
Also Read: జస్ట్ ఐదేళ్లల్లో చైనాను పక్కన నెట్టి .. అమెరికా సరసన.. మన డిఆర్డిఏ ఏం చేస్తోందంటే?
అడవికి వెళ్ళిన తర్వాత.. అక్కడ సరదాగా వంటలు వండుకున్నారు. స్నానం చేసిన తర్వాత వంటలు ఆరగించాలని భావించారు. ఈ క్రమంలోనే అడవిలో ఉన్న ఓ జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ నీళ్లు లేకపోవడంతో.. సమీపంలో ఉన్న కాల్వ వద్దకు వెళ్లారు. అక్కడ కొంతమంది యువకులు దిగి స్నానం చేస్తుండగా.. మరి కొంతమంది యువకులు గట్టుమీద ఉన్నారు. అందులో ఓ యువకుడికి ఏదో తగిలినట్టు అనిపించింది. అదేంటని చూడగా ఒక్కసారిగా ఆ జంతువును చూసి భయపడ్డాడు. వామ్మో అనుకుంటూ వెంటనే బయటికి వచ్చాడు. తన స్నేహితుడు భయంతో పరుగులు తీస్తున్న నేపథ్యంలో.. మిగతావారు కూడా అంతే వేగంతో బయటికి వచ్చేసారు. అయితే ఈ దృశ్యాలను మొత్తం మరో స్నేహితుడు వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
ఒడ్డుమీద కూర్చున్న ఆ వ్యక్తికి తగిలిన ఆ జంతువు మరేదో కాదు.. భయంకరమైన కోబ్రా.
ఆ యువకులు స్నానం చేస్తున్న ఏరియా దట్టమైన అడవి ప్రాంతం. పైగా విస్తారంగా వృక్షాలు ఉండడంతో అక్కడ రకరకాల జంతువులు ఆవాసం ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఆ యువకుడు ఒడ్డు మీద ఉండడంతో అతనిపై దాడి చేయడానికి కోబ్రా సిద్ధమైంది. ముందుగా అతడిని టచ్ చేసి చూసి చూసింది. అతడు వెంటనే అలెర్ట్ కావడంతో ఆ కోబ్రా వెనక్కి వెళ్లిపోయింది. తన స్నేహితుడిని కోబ్రా టచ్ చేయడంతో భయపడిపోయిన మిగతా స్నేహితుడు కూడా వెంటనే అక్కడి నుంచి వచ్చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది..” కోబ్రా దగ్గరికి వచ్చింది. కిస్ చేసి వెళ్ళింది. నీకు భూమి మీద నూకలు ఉన్నాయి. లేకుంటే ఈ సమయానికి నువ్వు గతకాలపు జ్ఞాపకం అయ్యేవాడివి. అందువల్లే విహారయాత్రలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దట్టమైన అడవులను సందర్శించేవారు అలర్ట్ గా ఉండాలి. లేకుంటే ఇలాంటి కోబ్రాల చేతిలో హతమవుతారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ యువకుడు అలెర్ట్ కావడం వల్ల బతికి బయటపడాడని నెటిజన్లు వివరిస్తున్నారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే లక్షలలో వీక్షణలు సొంతం చేసుకోవడం విశేషం.
View this post on Instagram