Ronaldo- Georgina Rodriguez: సౌదీ అరేబియా… గల్ఫ్ దేశాల్లో సంపన్నమైనది. పూర్తి ముస్లిం దేశమైన ఈ ప్రాంతం కఠిన చట్టాలను అమలు చేస్తుంది. ఎవరిని కూడా ఉపేక్షించదు. తమ దేశ నిబంధనలను అతిక్రమిస్తే ఉరిశిక్ష విధించేందుకు కూడా వెనుకాడదు.. అలాంటి ఈ దేశం ఆ ఆటగాడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఇటీవలే బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్ తో భారీ డీల్ కుదుర్చుకున్నాడు.. త్వరలో ఆ క్లబ్లో ఆడతాడు. ఇందుకుగాను రెండున్నర సంవత్సరాలు అతడు సౌదీలో నివాసం ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అతడు తన కుటుంబంతో సౌదీకి షిఫ్ట్ అయ్యాడు.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రొనాల్డో వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.

సౌదీ చట్టాలు ఏం చెబుతున్నాయంటే
సౌదీ అరేబియా చట్టం ప్రకారం వివాహం చేసుకోకుండా ఆడ, మగ ఇద్దరు ఒకే ఇంట్లో నటించడం చట్ట విరుద్ధం.. ఇక రొనాల్డో తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ తో సహజీవనం చేస్తున్నాడు..వీరికి బెల్లా, అలానా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. 2016లో రొనాల్డో రియల్ మాడ్రిడ్ కోసం ఆడుతున్నప్పుడు జార్జినా ను కలిశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి అది సహజీవనానికి దారితీసింది. బయట దేశాల్లో ఇది చెల్లుబాటు అవుతుందో కానీ… సౌదీలో మాత్రం దీనిని అంగీకరించరు..అల్ నాసర్ జట్టుకు ఆడుతున్న నేపథ్యంలో రొనాల్డో, జార్జినా రెండున్నర సంవత్సరాల పాటు సౌదీలో ఉండాల్సి ఉంటుంది. అయితే వీరిపై సౌదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వారు విదేశీయులు కాబట్టి సౌదీ చట్టాలు వారికి వర్తించవని తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు లేదా అది నేరానికి దారి తీసినప్పుడు మాత్రమే సౌదీ అధికారులు చర్యలు తీసుకుంటారని అక్కడి నిపుణులు చెప్తున్నారు..
కళ్ళు చెదిరేలా
ఇక ఆల్ నాసర్ తో భారీ డీల్ కుదుర్చుకున్న రొనాల్డో కు సౌదీ దేశం కళ్ళు చెదిరే సౌకర్యాలు కల్పించింది. ఆయనకు కేటాయించిన అధికారిక నివాసం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. 99 ఫ్లోర్లు ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్లో ఆయనకు రెండు ఫ్లోర్లను కేటాయించారు.. ఈ ఫ్లోర్లలో 17 గదులు ఉన్నాయి.. వీటన్నింటినీ రెండున్నర సంవత్సరాల పాటు రొనాల్డో కోసం బుక్ చేశారు. రొనాల్డో కుటుంబం, స్నేహితులు, భద్రతా సిబ్బంది ఇందులో నివాసం ఉంటారు.. దీని అద్దె, ఇతరత్రా ఖర్చులు నెలకు దాదాపు రెండున్నర కోట్లట! ఇక ఆల్ నాసర్ క్లబ్ రోనాల్డోకు రెండున్నర సంవత్సరాలకు గాను 200 మిలియన్ యూరోలకంటే ఎక్కువ చెల్లిస్తున్నది.

మాంచెస్టర్ యునైటెడ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని..
రొనాల్డో ఆల్ నాసర్ క్లబ్ కంటే ముందు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడేవాడు.. అయితే పోర్చుగల్ కెప్టెన్ పియర్స్ మోర్గాన్ తో వివాదాస్పద ఇంటర్వ్యూలో పాల్గొని ఇబ్బందుల పాలయ్యాడు.. విచక్షణ కోల్పోయి ఆ క్లబ్ నిర్వాహకుడిని దూషించాడు.. ఆ తర్వాత ఆ క్లబ్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. తర్వాత అతడిని ఆల్ నాసర్ క్లబ్ ప్రతినిధులు కలిశారు.. చర్చల అనంతరం 200 మిలియన్ల యూరోల కంటే ఎక్కువ ఆఫర్ తో రెండున్నర సంవత్సరాలకు డీల్ కుదిరింది.