spot_img
Homeక్రీడలుక్రికెట్‌India vs New Zealand T20 World Cup Final Viewership: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.....

India vs New Zealand T20 World Cup Final Viewership: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. ఫైనల్ మ్యాచ్ ను ఎన్ని కోట్ల మంది చూశారంటే?

India vs New Zealand T20 World Cup Final Viewership: అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మైదానం కెపాసిటీ లక్షకు పై చిలుకు ఉండగా.. కొంతమంది అభిమానులు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఇక టీవీలలో.. ఫోన్లలో కోట్లాదిమంది అభిమానులు లైవ్ మ్యాచ్ వీక్షించారు.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

ఈ మ్యాచ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లైవ్ స్ట్రీమ్ అయింది. న్యూజిలాండ్ జట్టు చివరి వికెట్ కోల్పోయే సమయం వరకు జియో హాట్ స్టార్ లో లైవ్ కోట్లుగా నమోదయింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైం వరకు స్ట్రీమింగ్ 82.1 కోట్లకు చేరుకుంది. లైఫ్ స్ట్రీమ్ లో ఒకే టైంలో నమోదైన వ్యూస్ లో(పీక్ కాన్కరెంట్) లో ఇదే అత్యధికం కావడం విశేషం. దీని తర్వాత 6.5 కోట్లతో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్, జేక్ పాల్ వర్సెస్ మైక్ టైసన్ మ్యాచ్ ఉన్నాయి.

2024 తర్వాత టీమ్ ఇండియా టి20 క్రికెట్ పూర్తిగా మారిపోవడం.. ముఖ్యంగా ఏ ఒక్క టోర్నీని కూడా టీమిండియా కోల్పోకపోవడం.. ఆటగాళ్లందరూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో అభిమానులు లైవ్ మ్యాచ్ చూసేందుకు ఇష్టపడ్డారు. తమ ఫోన్లలో టీమిండియా ఆటగాళ్ల పోరాటాన్ని చూసి మురిసిపోయారు. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏమాత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ అభిమానులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. ఫోన్ స్క్రీన్ లకు అతుక్కుపోయారు. లైవ్ మ్యాచ్ చూస్తూ ఆనందించారు. ఇన్ని కోట్ల వ్యూయర్షిప్ నమోదయిందంటే అది ముమ్మాటికి టీమిండియా ఫైనల్ వెళ్లడం వల్లే సాధ్యమైందని జియో హాట్స్టార్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో వ్యూయర్ షిప్ నమోదు కావడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీగా ఆదాయం వచ్చి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

“ఇండియాలో క్రికెట్ అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు. పైగా కొంతకాలంగా టి20 ఫార్మేట్ లో టీమిండియా స్థిరమైన ఆట తీరు కొనసాగిస్తోంది. ఏ ఒక్క టోర్నీ కూడా టీమిండియా ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు తమ జట్టును ఎంకరేజ్ చేయడానికి అనేక రకాల మార్గాలను ఎంచుకున్నారు. అందులో లైవ్ స్ట్రీమింగ్ చూడటం ఒకటి. మైదానానికి భారీగా అభిమానులు పోటెత్తారు. మైదానంలో లిమిటెడ్ సీట్లు ఉంటాయి. అదే ఫోన్లో అయితే అన్లిమిటెడ్ గా చూడొచ్చు. అందువల్లే చాలామంది లైవ్ స్ట్రీమింగ్ కు జై కొట్టారు. ఫలితంగా ఈ స్థాయిలో రికార్డులు నమోదయ్యాయని” జియో హాట్ స్టార్ వర్గాలు చెబుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version