spot_img
Homeట్రెండింగ్ న్యూస్Sashtang Namaskara Yatra: మండు వేసవిలో సాష్టాంగ నమస్కార యాత్ర.. నాగ సాధువుల సాహసం!

Sashtang Namaskara Yatra: మండు వేసవిలో సాష్టాంగ నమస్కార యాత్ర.. నాగ సాధువుల సాహసం!

Sashtang Namaskara Yatra: ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. చెప్పులు, ఛత్రి, నెత్తికి టోపీ, చెవులకు రుమాల్‌ కట్టుకుని కూడా బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ, మండుతున్న ఎండలో కూడా ఈ సాధావులు యాత్ర చేస్తున్నారు. అదీ సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారి యాత్రను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌ నుంచి..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాగ సాధువులు లోకకళ్యాణార్థం ఉత్తరాఖండ్‌ లోని గంగోత్రి నుంచి ఈ సాష్టాంగ నమస్కార యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలోనిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి చేరుకుంది శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి వారి యాత్రను ప్రారంభించారు.

ధర్మకోల్‌ షీట్‌పై సాష్టాంగ నమస్కారం చేస్తూ..
ధర్మకోల్‌ షీట్‌ లాంటి దుప్పటిని రోడ్డుపై పరిచి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ నాగసాధువులు ముందుకు సాగుతున్నారు. చేతిలో రాళ్లు పట్టుకుని.. థర్మకోల్‌ షీట్‌ కింద పరిచి దానిపై సాష్టాంగ నమస్కారం చేసి చేయిచాచి.. అందులోని రాయిని అక్కడ పెడుతున్నారు. మళ్లీ పైకిలేచి.. ఆరాయి దగ్గర మళ్లీ థర్మకోల్‌షీట్‌ పరిచి మళ్లీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇలా వారియాత్ర సాగుతోంది. సాధువుల భక్తిని చూసి ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో సాగుతున్న ఈ యాత్ర సామాన్య భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. వేకువ జాముతో యాత్ర ప్రారంభించే వీరు సాయంత్రం వరకు అత్యంత నియమనిష్టలతో సాష్టాంగ నమస్కారం యాత్ర సాగిస్తున్నారు. సాయంత్రం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసి పూజార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రామేశ్వరం వరకూ..
నాగసాధువులు ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు తెలిపారు. రామేశ్వరానికి చేరుకోవడంతో యాత్ర పరిపూర్ణమవుతుందని పేర్కొంటున్నారు. లోకకళ్యాణం కోసమే ఈ యాత్ర చేపట్టామని పేర్కొంటున్నారు. యాత్ర సాగుతున్నంతసేపు ఎలాంటి ఆహారం తీసుకోమని సాధువులు తెలిపారు. సాయంత్రం పూజ చేసిన తర్వాతనే ఆహారం తీసుకుంటున్నారు.

సాష్టాంగ నమస్కారం అంటే..
హిందూ ప్రామాణిక గ్రంథాలలో సైతం సస్తాంగ నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. ఉరసా – తొడలు, శిరసా – తల, దృష్ట్యా – కళ్లు, మనసా – హృదయం, వచసా – నోరు, పద్భ్యాం – పాదాలు, కరాభ్యాం – చేతులు, కర్ణాభ్యాం – చెవులు.. ఇలా ఎనిమిది అంగాలు నేలను తాకేలా నమస్కారం చేయడాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. సహజంగా మనిషి ఈ ఎనిమిది అంగాలతోనే దోషాలు చేస్తుంటాడు. ఆ పాపాలను తొలగించమని, సద్బుద్ధిని ప్రసాదించమని వేడుకుంటూ నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version