
Vijay Devarakonda- Samantha: సమంతకు విజయ్ దేవరకొండ మద్దతుగా నిలిచారు. సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం విడుదల నేపథ్యంలో ఆమె పోరాటస్ఫూర్తిని, నిబద్ధతను కొనియాడుతూ… సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విజయ్ దేవరకొండ పరోక్షంగా శాకుంతలం చిత్రానికి ప్రచారం కల్పించారు. ఈ క్రమంలో సమంత ఎమోషనల్ అయ్యారు. ‘సామ్ నువ్వు ఎల్లవేళలా ప్రేమను పంచుతావు. ప్రతి పని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటావు. నీ చుట్టూ ఉన్నవాళ్లలో ఉత్సాహం నింపుతావు. ప్రతి సన్నివేశం కోసం కష్టపడతాడు. ఆ సన్నివేశం మీదే నీ కెరీర్ ఆధారపడి ఉందన్నట్లు భావిస్తావు.
సంవత్సర కాలంగా నువ్వు యుద్ధం చేస్తున్నావు. అది ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. నీలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ అభిమానుల కోసం చిత్రాలు చేస్తున్నావు… అని కామెంట్ చేశారు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా పోస్ట్ సమంతను భావోద్వేగానికి గురి చేసింది. ‘ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఈ సమయంలో నాకు కావాల్సింది ఇదే’ అని సమంత రిప్లై ఇచ్చారు. వీరి సోషల్ మీడియా సంభాషణ వైరల్ అవుతుంది.

శాకుంతలం మూవీలో సమంత హీరోయిన్ గా నటించారు. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. అందుకే పలువురు స్టార్స్ శాకుంతలం చిత్రానికి తమా మద్దతు ప్రకటిస్తున్నారు. అల్లు అర్జున్ సైతం శాకుంతలం మూవీ చూడాలంటూ ట్వీట్ చేశారు. ఇక సమంతతో విజయ్ దేవరకొండకు మంచి అనుబంధం ఉంది. మహానటి చిత్రం కోసం ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ-సమంత జతకట్టారు. ఆ మూవీలో వీరిద్దరూ జర్నలిస్ట్స్ గా నటించారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఖుషి మూవీలో కలిసి నటిస్తున్నారు.
ఖుషి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. శివ నిర్వాణ దర్శకుడు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. కాగా నేడు విడుదలైన శాకుంతలం మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాత. మణిశర్మ సంగీతం అందించారు. శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కూతురు అర్హ బాల భరతుడు పాత్ర చేయడం విశేషం.