
Samantha: సమంత మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా సమంత షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఫస్ట్ సిటాడెల్ సెట్స్ లో అడుగుపెట్టిన ఆమె, ఖుషి చిత్ర షూట్ సైతం తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక చిత్రంగా శాకుంతలం తెరకెక్కించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. శాకుంతలం విజయాన్ని సమంత సీరియస్ గా తీసుకున్నారు.
ఈ మూవీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ సమంత. దర్శకుడు గుణశేఖర్ ని తెలుగు ఆడియన్స్ మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ఆయన ఫేమ్ ఆధారంగా ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ఆస్కారం లేదు. అందులోనూ మూవీ మీద నెగిటివిటీ నడుస్తుంది. సీరియల్ ని తలపిస్తున్న ఈ నాసిరకం గ్రాఫిక్స్ మూవీ జనాలకు నచ్చుతుందా అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో సమంత మీద యూనిట్ ఆధారపడ్డారు. శాకుంతలం చిత్రానికి హైప్ తేవాల్సిన బాధ్యత ఆమెదే.

ఈ క్రమంలో సమంత గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం విశేషం. మోడ్రన్ డ్రెస్సులో సమంత సూపర్ స్టైలిష్ గా దర్శనమిస్తున్నారు. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత చేస్తున్న ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు సమంత ఈజ్ బ్యాక్ అంటున్నారు. సమంత గ్లామరస్ ఫోటో షూట్స్ చేసి చాలా కాలం అవుతుంది. విడాకులు, అనారోగ్య సమస్యలు నేపథ్యంలో సమంత ఫోటో షూట్స్ చేయడం తగ్గించారు.

తాజాగా కోట్, ప్యాంటు ధరించి కిరాక్ ఫోజులతో కిక్ ఇచ్చారు. బటన్స్ తీసేసి యద అందాలు చూపించే ప్రయత్నం చేశారు. సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ఖుషి చిత్ర విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఖుషి తెరకెక్కుతుంది.
అలాగే సిటాడెల్ షూట్ పూర్తి చేసే పనిలో సమంత బిజీగా ఉంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్న సిటాడెల్ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకులు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సిరీస్ కోసం సమంత యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోవడం విశేషం. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్తో సమంత భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే.