Samantha: సౌత్ ఇండియా లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు సమంత..అందం తో పాటుగా అద్భుతమైన అభినయం సమంత సొంతం.. అందరూ ఆమెని నేటి తరం సావిత్రి అని అంటుంటారు..వెండితెర మీద మాత్రమే కాదు.. నిజజీవితం లో కూడా ఈమె సావిత్రి లాగానే ఉంది.. సావిత్రి తన జీవితం లో ఎలాంటి కష్టాలను ఎదురుకుందో, సమంత కూడా ఇంచుమించు అలాంటి కష్టాలనే ఎదురుకొంటుంది.

ఎందుకంటే ఆమె వైవాహిక జీవితం మధ్యలోనే ఆగిపోయింది..దానివల్ల ఆమె ఎలాంటి మానసిక క్షోభ కి గురి అయ్యి ఉంటుందో ఊహించుకోవచ్చు..ఎలాగో దానిని అధిగమించి విజయవంతం గా ముందుకు వెళ్లేందుకు సమంత తనని తాను ఒక వారియర్ గా మార్చుకుంది.. కానీ దేవుడికి ఆమె మీద ఎందుకు కనికరం లేదో పాపం.. వెంటనే ‘మయోసిటీస్’ అనే ప్రాణంతక వ్యాధిని ఇచ్చాడు.. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఆరు నెలల నుండి హాస్పిటల్ కి పరిమితమైంది.
అయితే సమంత చాలా స్ట్రాంగ్ మహిళ అనే విషయం అందరికీ తెలిసిందే..నలుగురుకి ఆదర్శం గా ఉండేలాగానే ఆమె ప్రయత్నం చేస్తుంది.. ఎన్ని బాధలు పడుతున్నా కూడా మొహం మీద చిరునవ్వు పోనివ్వొద్దు.. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంది.. రీసెంట్ గానే ఆమె అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించింది.

ఒక అభిమాని ‘ఎలా ఉన్నావు’ అని అడగగా సమంత దానికి సమాధానం చెప్తూ ‘జీవితం ఇంతకు ముందులాగ లేదు’ అని ఎమోషనల్ గా సమాధానం చెప్తుంది.. ఆ తర్వాత అభిమానులు నీకు మేము ఉన్నాము.. అధైర్య పడొద్దు, నీ ఆరోగ్యం మెరుగుపడడానికి మేము ప్రార్థనలు చేస్తున్నాము.. అని చెప్పగా అప్పుడు సమంత అందుకు బదులుఇస్తూ ‘మీ అందరి ప్రేమాభిమానాలు మరియు ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉండాలి ‘ అని చెప్తుంది..ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ అనే సినిమా వచ్చే నెల 17 వ తారీఖున విడుదల కాబోతుంది..ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మించాడు.. దిల్ రాజు సహనిర్మాత గా వ్యవహారించాడు.