Samantha: మెగా ఫ్యామిలీ లో హీరోలందరూ ఎంత ప్రేమగా ఉంటారో మన అందరికి తెలిసిందే..ఈ కాలం లో మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇలా ఉంటారో లేదో తెలీదు కానీ, కుటుంబం అంటే ఇలాగే ఉండాలి అనిపించే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ..కానీ వీళ్ళ మధ్య ఎంత ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆ సఖ్యత లేదు.మెగా కుటుంబం లో రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ప్రేమ ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.

బాబాయ్ – అబ్బాయి మధ్య ఇంత అనుబంధం ని ఎక్కడైనా చూశామా అని,కానీ ప్రస్తుతం వీళిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చాలా నీచంగా ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు..గత రెండు రోజుల నుండి ట్విట్టర్ లో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ మాత్రమే కనిపిస్తున్నాయి..వేరే వార్తలేవి కనిపించడం లేదు.
వీళ్ళ మధ్య ఈ రేంజ్ గొడవలు రావడానికి అసలు కారణం సమంత..కొద్దీ నెలల క్రితమే ఆమె బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో ముఖ్య అతిధిగా పాల్గొంది.ఇక్కడ యాంకర్ కరణ్ జోహార్ సమంత ని హీరోల గురించి ర్యాపిడ్ ఫైర్ సమాదానాలు చెప్పమని అడుగుతాడు..అలా ఆయన ఒక్కో హీరో గురించి అడుగుతూ ఉండగా సమంత వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది,రామ్ చరణ్ గురించి చెప్పమంటే ‘OG’ అని సమాధానం ఇస్తుంది.OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అన్నమాట, ఇది చాలా పెద్ద ట్యాగ్.

అయితే ఇదే పేరు తో పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెల్సిందే, ఈమధ్యనే ఆ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి..ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుండి ఈ మా OG ట్యాగ్ కొట్టేసారు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అనడం, దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడం వల్ల ఈ గొడవ తారాస్థాయికి చేరుకుంది..ఎప్పుడు ఫులుస్టాప్ పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది..దీనిపై రామ్ చరణ్ స్పందిస్తే కానీ గొడవలు ఆగేటట్టు లేవు, కానీ ఆయన స్పందిస్తాడో లేదో చూడాలి.