Yashoda Collections: సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది..మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో కోటి 63 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు ఊహించిన దానికంటే గ్రోత్ ని చూపిస్తూ కోటి 76 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

కానీ మూడవ రోజు మాత్రం మొదటి రెండు రోజులతో పోలిస్తే కాస్త తక్కువ వసూళ్లు వచ్చాయనే చెప్పాలి..మూడవ రోజు ఈ చిత్రానికి దాదాపుగా కోటి 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అలా కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా 5 కోట్ల రూపాయిల వసూళ్లను కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండి రాబట్టింది..ఇక నాల్గవ రోజు కూడా ఈ చిత్రానికి 60 లక్షల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి.
పాన్ ఇండియా చిత్రం గా విడుదలైన ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 11 కోట్ల రూపాయలకు జరిగింది..ఈ 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తాన్ని ఈ చిత్రం కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల నుండే వసూలు చేసేలా ఉంది..ఇక ఈ చిత్రం ఓవర్సీస్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి..మొదటి వీకెండ్ లో ఈ సినిమా ఓవర్సీస్ లో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..అంటే అమెరికన్ డాలర్స్ లెక్కలోకి వేస్తె దాదాపుగా 5 లక్షల డాలర్లు వసూలు చేసింది అన్నమాట.

ఫుల్ రన్ లో ఈ చిత్రం ఇక్కడ 1 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి తెలుగు వెర్షన్ ఇప్పటి వరుకు ౯ కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా బ్రేక్ ఈవెన్ కి కేవలం అడుగు దూరం లోనే ఉంది..రాబొయ్యే రోజుల్లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ వీకెండ్ బాగా కలిసి వస్తే ఈ చిత్రం సమంత కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది.