
Kisi Ka Bhai Kisi Ki Jaan : బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం ఈ నెల 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ , పాటలను విడుదల చేసారు.ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసారు.ఈ ట్రైలర్ కి రెస్పాన్స్ అదిరిపోయింది.
ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్ర పోషించాడు. జగపతి బాబు మెయిన్ విలన్ గా నటించాడు.మొదటి నుండి ఈ సినిమా తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రానికి రీమేక్ అనే ప్రచారం జరుగుతూ ఉండేది.ఒక ఫ్లాప్ సినిమాని రీమేక్ చేయడం ఏమిటి..?, బహుశా ఫేక్ న్యూస్ అయ్యుంటాడని అందరూ అనుకున్నారు.
కానీ ట్రైలర్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రాన్ని మక్కీకి మక్కీ దింపేశాడని అర్థం అవుతుంది. తమిళం లో అజిత్ హీరో గా నటించిన ‘వీరం’ చిత్రానికి రీమేక్ గా ‘కాటమరాయుడు’ తెరకెక్కింది. అంతకు ముందే ‘వీరం’ సినిమాని తెలుగులో ‘ వీరుడొక్కడే’ అనే పేరు తో దబ్ చేసి గ్రాండ్ గా విడుదల చేసారు, టీవీ లో కూడా ఎన్నో సార్లు టెలికాస్ట్ చేసారు.
దాని ప్రభావం ‘కాటమరాయుడు’ చిత్రంపై బలంగానే పడింది, అందుకే కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.ఇప్పుడు ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేసాడు, ఇందులో శృతి హాసన్ రోల్ ని పూజా హెగ్డే చెయ్యగా, నాజర్ రోల్ ని విక్టరీ వెంకటేష్ చేసాడు. కాటమరాయుడు ఇంటర్వెల్ ఫైట్ తో సహా కాపీ కొట్టేసినట్టు అనిపిస్తున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
