Sai Pallavi: సాయి పల్లవి విషయంలో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఆమె కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. సాయి పల్లవి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చివరి చిత్రం గార్గి. తెలుగులో విరాటపర్వం. డిమాండ్ ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా సైలెంట్ కావడం పలు ఊహాగానాలకు కారణమైంది. సాయి పల్లవి వివాహం చేసుకోబోతున్నారని అందుకే నటనకు గుడ్ బై చెప్పారంటూ వార్తలు వచ్చాయి. మరో కథనం ఏమిటంటే… ఆమె డాక్టర్ గా స్థిరపడాలి అనుకుంటున్నారు. సొంతగా క్లినిక్ స్టార్ట్ చేసి వైద్య సేవలు అందించాలని ఫిక్స్ అయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.

అయితే సినిమాలు మానేశారన్న వార్తలకు సాయి పల్లవి చెక్ పెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి బెటర్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. సాయి పల్లవి అంటే తమ ఇంట్లో ఓ ఫ్యామిలీ మెంబర్ గా ప్రేక్షకులు భావిస్తారు. వారు మెచ్చుకునేలా, వారిని అలరించేలా నా పాత్రలు ఉండాలి. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నాను. మంచి పాత్ర దక్కితే భాషాబేధం లేకుండా సినిమా చేస్తాను, అని వివరణ ఇచ్చారు. ఇది ఒకింత ఆమె అభిమానులకు ఉపశమనం కలిగించింది.
అయితే ఫస్ట్ టైం ఓ స్టార్ హీరో సరసన సాయి పల్లవికి ఆఫర్ వచ్చిందంటూ కోలీవుడ్ లో ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ తో అజిత్ తన 62వ చిత్రానికి సైన్ చేశారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. విగ్నేష్-అజిత్ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారట. ఈ మేరకు ఆమె సైన్ చేశారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం రావాల్సి ఉండగా … పరిశ్రమ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు సాయి పల్లవికి ఓకే కావాలని ఫాన్స్ ప్రార్ధనలు చేస్తున్నారు.

సాయి పల్లవి ఇంత వరకు స్టార్ హీరోలతో జతకట్టింది లేదు. ఆమె నటించిన అతిపెద్ద స్టార్స్ అంటే ధనుష్, సూర్యలే. టైర్ వన్ స్టార్స్ తో కలిసి నటించలేదు. అజిత్ మూవీ ఓకే అయితే ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుంది. అయితే ఇక్కడ ఓ చిక్కొచ్చిపడింది. స్టార్ ఎవరైనా పాత్ర నచ్చితేనే సాయి పల్లవి చేస్తుంది. తనకు సినిమాలో ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే ప్రాజెక్ట్ కి సైన్ చేస్తారు. లేదంటే నిర్ధాక్షిణ్యంగా నో చెబుతారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి చెల్లి పాత్ర కోసం అడిగితే సాయి పల్లవి చేయనని చెప్పడం విశేషం.