Sai Pallavi Wedding: క్రేజీ హీరోయిన్ ‘సాయి పల్లవి’ పెళ్లి టాపిక్ మళ్ళీ వైరల్ అవుతుంది. 2021 లో సాయి పల్లవి చేసిన రెండు సినిమాలు ‘లవ్ స్టోరీ’, ‘శ్యామ్ సింగ రాయ్’ మంచి విజయాలు సాధించాయి. ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి సడెన్ గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ? 2022లో సాయి పల్లవి ఏ సినిమాలు చేస్తోందో క్లారిటీ లేదు. పైగా ఇప్పటివరకు ‘సాయి పల్లవి’ మరో తెలుగు సినిమా ఒప్పుకోలేదు.
ఇంకా సాయి పల్లవి ఏ తెలుగు సినిమా సైన్ చెయ్యలేదు కాబట్టి.. బహుశా ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. దాంతో తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి తన మనసులో మాటని బయట పెడుతూ అందరికీ క్లారిటీ ఇచ్చింది. తనకు 30 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే, తాను ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నది నిజమే అని, కాకపోతే అది పెళ్లి కోసం కాదని ఆమె స్పష్టం చేసింది.
Also Read: సడన్ గా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. అభిమానులంతా షాక్?
ప్రస్తుతం సాయి పల్లవికి 29 ఏళ్ళు. అంటే సాయిపల్లవి లెక్క ప్రకారం ఇంకో ఏడాది తర్వాత ఆమె తన పెళ్లి గురించి ఆలోచిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా సాయి పల్లవి వ్యక్తిత్వం చాలా మంచిది అని టాక్ ఉంది. అందుకే ఆ మధ్య ఆమె క్యారెక్టర్ కి ఒక దర్శకుడు తెగ కనెక్ట్ అయిపోయాడని, సాయిపల్లవికి అతను పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టాడని వార్తలు వచ్చాయి.
సాయి పల్లవి మాత్రం అతని ప్రేమను సున్నితంగా తిరస్కరించిందట. అయినా సాయి పల్లవి ప్రేమాయణం గురించి గతంలోనే అనేక రూమర్స్ వచ్చాయి. ఒక తమిళ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. మొత్తానికి సాయి పల్లవి ప్రేమాయణం గురించిన న్యూస్ సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా అనేక రకాలుగా వైరల్ అవుతూనే ఉంది.
Also Read: 2021 టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ.. సామ్ చై విడాకుల నుంచి నేచురల్ స్టార్ నాని వరకు..!