
Sachin Bluetick : ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ తీసుకొచ్చిన పెయిడ్ “బ్లూ టిక్” విధానం సెలబ్రిటీలకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది..ఇప్పుడు ఈ జాబితా లో మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేరారు. ఇటీవల అతడు “అస్క్ సచిన్” పేరుతో తనను ఏదైనా అడగవచ్చని ట్విట్టర్ లో తన అభిమానులకు అవకాశం ఇచ్చాడు. ఈ సందర్భంగా పలువురు సచిన్ ను ఆసక్తికర ప్రశ్నలు అడిగారు..మీరు ఐపీఎల్ లో ఆడితే చూడాలని ఉందని కొందరు అడిగారు.. కొందరైతే 90 కాలం నుంచి రిటైర్మెంట్ ప్రకటించేదాకా సాధించిన సెంచరీలను ఒక ఆల్బమ్ రూపంలో సచిన్ కు చూపించారు. దీంతో సచిన్ వారి అభిమానానికి ముగ్ధుడయ్యాడు. చేతులు జోడించి నమస్కరించే ఎమోజీ పెట్టాడు. ఈ చర్చ ఇలా సాగుతుండగానే ఒక అభిమాని అడిగిన ప్రశ్న సచిన్ ను ఆశ్చర్యంలో ముంచింది.
ప్రస్తుతం ట్విట్టర్ నెలకు ఏడు డాలర్ల చొప్పున వసూలు చేస్తూ బ్లూటిక్ సదుపాయాన్ని కల్పిస్తోంది.. అయితే ఇటీవల కొంతమంది సెలబ్రిటీలకు ఆ బ్లూ టిక్ తొలగించింది.. అందులో సచిన్ టెండుల్కర్ కూడా ఉన్నాడు. ఇదే సమయంలో ఆస్క్ మీ అని సచిన్ అడగడంతో.. ఇక అభిషేక్ కిర్ స్టెన్ అనే ఓ నెటిజన్ ” నీ అకౌంట్ కి బ్లూ టిక్ లేదు. నువ్వు అసలు సచిన్ వని గ్యారెంటీ ఏంటి?” అని ప్రశ్నించాడు. దీంతో సచిన్ కు మతి పోయినంత పనైంది. దీంతో అతడు చేరుకొని ఒక ఫోటో పోస్ట్ చేశాడు. చూపుడువేలు కొంచెం వంచి, బొటన వేలు ను వాలుగా పెట్టి, బ్లూ నెక్ ధరించి… తన అసలైన ఖాతాకు ఇదే బ్లూ టిక్ అని అతడి ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. సచిన్ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.. ప్రస్తుతం అభిషేక్ కిర్ స్టెన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కూడా నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. 38.6 మిలియన్ పాలోవర్లు ఉన్న సచిన్ కు ఏ బ్లూ టిక్ అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో సెలబ్రిటీలు ఏడు డాలర్లు మస్క్ కు కట్ట లేరా? బ్లూ టిక్ లేకుండా వారి ఖాతా ఒరిజనలో? కాదో? ఎలా తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో ఇలా బ్లూ టిక్ ద్వారా సంపాదించిన డబ్బులను ఎలన్ మస్క్ వేరే వ్యాపారాల్లోకి మళ్ళిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మొత్తాన్ని బ్లూ టిక్ ఖాతా సచిన్ ను కూడా కొంతమేర ఇబ్బందికి గురిచేసింది.
మస్క్ తీసుకున్న బ్లూ టిక్ విధానం ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. ట్విట్టర్ పని తీరు మెరుగుపరచాల్సింది పోయి.. బ్లూ టిక్ కు డబ్బులు వసూలు చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన విధానం కాదంటూ దెప్పి పొడుస్తున్నారు. అలాంటప్పుడు భిన్నమైన వ్యక్తులకు కూడా డబ్బులు చెల్లిస్తే బ్లూ టిక్ ఇస్తారా అని మండి పడుతున్నారు. సచిన్ లాంటి వ్యక్తికి బ్లూ టిక్ లేకుంటే అతడి ఖాతా నిజం అని ఎలా నమ్ముతామంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సచిన్ బ్లూ టిక్ మాయమైన కొద్ది గంటల తర్వాత మళ్లీ అతని ఖాతాకు ట్విట్టర్ బ్లూ టిక్ ను యాడ్ చేయడం విశేషం..
As of now, this is my blue tick verification! 😬 https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2
— Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023