
Akshaya Tritiya : అందమైన ఆభరణాలు ధరించడమంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. అదీ అక్షయ తృతీయ రోజు వేసుకోడానికి ఆత్రుత పడుతారు. అక్షయ తృతీయ రోజు పిసిరంత బంగారం కొనుగోలు చేయాలని చాల మందికి సెంటిమెంట్ ఉంటుంది. దీంతో స్వర్ణకారులు, జువెల్లరీ షోరూం నిర్వాహకులు ఈరోజు కోసం ఎదురుచూస్తుంటారు. అక్షయ తృతీయ రోజు ఎక్కువ అమ్మకాలు ఉంటాయని భావించి, వినియోగదారులను ఆకర్షించే ఆభరణాలు అందుబాటులో ఉంచుతారు. అయితే ఈసారి అక్షయ తృతీయపై అమ్మకం దారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈరోజున కొనుగోళ్లు పెరుగుతాయని భావించారు. కానీ కనీసం విక్రయాలు కూడా లేవని చాలా మంది అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అదేంటో చూద్దాం..
అక్షయ తృతీయ వస్తుందనగానే బంగారం కొనేవాళ్లు.. అమ్మేవాళ్లు ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటారు. అయితే గత కరోనా కారణంగా దాదాపు మూడేళ్ల పాటు విక్రయాలు జరగలేదు. పెళ్లిళ్లు, ఇతర అవసరాలు తప్ప ప్రత్యేకంగా కొనుగోలు చేసేవారు తక్కువే. అయినా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు అంతర్జాతీయంగా కమొడిటీల ధరలు పెరగడమేనని జువెల్లరీ షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా తరువాత కాస్త అమ్మకాలు పెరగడంతో వీరిలో కాస్త ఉత్సాహం వచ్చింది.
అయితే గత ఏడాది కంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ రోజు బంగారం అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. గత ఏడాది అక్షయ తృతీయ రోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.50, 800 ఉంది. ఈ సంవత్సరం రూ.60,800కు పెరిగింది. అంటే ఏడాది కాలంలో 20 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర విపరీతంగా పెరగడంతో చాలా మంది వినియోగదారులు బంగారంకొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. చాలా మంది 1 నుంచి 2 గ్రాముల వరకే కొనుగోలు చేశారని షో రూం నిర్వాహకులు వాపోతున్నారు.

అయితే అక్షయ తృతీయ శనివారం, ఆదివారం జరుపుకోనున్నారు. శనివారం అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. అయితే హాలీడే ఆదివారం కూడా ఉంటాయని భావిస్తున్నారు. కానీ చెప్పలేమని మరికొందరు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే నార్త్ కంటే సౌత్ లోనే జువెల్లరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకర్షించే ప్రకటనలు ఇచ్చారు. కొందరు డిస్కౌంట్లను ఆఫర్ చేశారు. కానీ అనుకున్న కస్టమర్లు రాలేదని చెబుతున్నారు. మొత్తంగా బంగారం ధర విపరీతంగా పెరగడంతోనే అమ్మకాలు పడిపోతున్నాయని షో రూం నిర్వాహకులు చెబుతున్నారు.